ప్రయాణానికి ముందు ఎక్కువగా తినడం మానుకోవాలి. ప్రయాణానికి కనీసం 45 నిమిషాలు లేదా ఒక గంట ముందు తేలికపాటి భోజనం తినాలి. ప్రయాణానికి ముందు వేయించిన ఆహారాలు, మద్యం, ధూమపానం మానుకోవాలి. తులసి, లవంగాలు, నిమ్మ వంటి సువాసన మూలికలు వికారం నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే, వెంటనే వాహనం వేగాన్ని తగ్గించమని కోరండి.