Blood Pressure: సహజ పద్ధతుల్లో బీపీ నియంత్రించే అద్భుత టిప్స్.. మందులతో అవసరంలేదిక!
జీవనశైలి వ్యాధుల్లో ముందు వరుసలో ఉండేది బ్లడ్ ప్రెజర్. దీనిని నియంత్రించడానికి రోజూ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా మందులతో కాకుండా కేవలం రోజువారీ జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా సహజ పద్ధతుల్లో బీపీని నియంత్రించుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
నేటి జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా అధిక మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను ఇది ప్రభావితం చేస్తుంది. అధిక రక్తపోటుకు చికిత్స చేయకుండా వదిలేస్తే, అది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాలకు దారితీస్తుంది. అయితే, మందులతో పని లేకుండా సహజంగా రక్తపోటును తగ్గించడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
రోజూ నడక – వ్యాయామం
అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి ప్రతిరోజూ నడక, వ్యాయామం చేయడం చాలా అవసరం. రోజువారీ వ్యాయామం మీ గుండెను బలపరుస్తుంది. రక్తాన్ని పంప్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ధమనులలో ఒత్తిడి తగ్గిస్తుంది. వాకింగ్ వంటి చిన్నపాటి వ్యాయామాలు వారానికి 150 నిమిషాలు చేయాలి. అలాగే రన్నింగ్ వంటి తీవ్రమైన వ్యాయామం వారానికి 75 నిమిషాల చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎక్కువ వ్యాయామం రక్తపోటును మరింత తగ్గించగలదని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.
ధ్యానం
అధిక రక్తపోటును తగ్గించడంలో ధ్యానం చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఎందుకంటే అధిక BP ఉన్నవారికి శ్వాసక్రియతో కూడిన యోగా చాలా మంచిది. ధ్యానం చేయడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.
బాలసన్
బలాసనం చేయడం ద్వారా కూడా బీపీ నియంత్రణలో ఉంటుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. తుంటి, వెన్నెముకకు కూడా ప్రయోజనం కలుగుతుంది.
ఉప్పు తక్కువగా తినాలి
ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగాన్ని పూర్తిగా మానేయాలి. అలాగే సోడియం అంటే ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తాజా పదార్థాలను తినడం అలవాటు చేసుకోవాలి. ఉప్పుకు బదులుగా మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించవచ్చు.