AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 4 రోజుల షూటింగ్ తర్వాత ప్రభాస్ మూవీ నుంచి పీకేశారు.. కట్ చేస్తే పాన్ ఇండియా..

సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లక్ ఎప్పుడు కలిసి వస్తుందో.. ఎవరి ఫేట్ ఎప్పుడు మారిపోతుందో చెప్పడం చాలా కష్టం. ప్రతి శుక్రవారం ఇక్కడ జీవితాలు మారిపోతూ ఉంటాయి. ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరి చేతుల్లోకి వెల్లిపోతూ ఉంటాయి.

Tollywood: 4 రోజుల షూటింగ్ తర్వాత ప్రభాస్ మూవీ నుంచి పీకేశారు.. కట్ చేస్తే పాన్ ఇండియా..
Heroine
Ram Naramaneni
|

Updated on: Oct 07, 2024 | 3:44 PM

Share

ఫిల్మ్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలి అంటే ఆనపకాయ అంత టాలెంట్‌తో పాటు ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. కొంతమంది ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్నా.. చిన్న, చిన్న వేషాలు కూడా దక్కవు. కొందరికి మాత్రం ఇలా ఇండస్ట్రీకి వచ్చి అలా స్టార్స్ అయిపోతారు. ఇలా తక్కువ టైంలో ఇండస్ట్రీలో తోపులు అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వారిలో ఈ భామ కూడా ఒకరు. ఈమె దక్షిణాది నుంచి సినిమా ప్రస్థానం ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర హీరోల సరసన నటించింది. తను మరెవరో కాదు.. అందాల రకుల్ ప్రీత్ సింగ్.

రకుల్‌కు సక్సెస్ త్వరగానే వచ్చినా.. కెరీర్ ప్రారంభంలో ఆమెను ప్రభాస్‌ మూవీకి సెలెక్ట్ చేసి.. 4 రోజులు షూటింగ్ అవ్వగానే తొలిగించారు. ఇంకొన్ని పెద్ద సినిమాల విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ తర్వాత.. నేలకు కొట్టిన బంతిలా పైకి ఎగిరి.. వరుస అవకాశాలు ఒడిసిపట్టింది. రకుల్ ‘గిల్లీ’ (2009) అనే కన్నడ మూవీతో కథానాయికగా పరిచయం అయింది. 2011లో ‘కెరటం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది.  తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. వాస్తవనికి ఆమె ప్రభాస్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.. కానీ అనివార్య కారణాల వల్ల ఆమెను తప్పించారు.

ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి రకుల్ చెప్పింది. తన డెబ్యూకు ముందు, ఒక మూవీ హీరోయిన్‌గా సెలక్ట్ చేసి, నాలుగు రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని, కనీసం ఆ విషయాన్ని తనకు తెలియజేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ సినిమా నాకు రావాల్సింది కాదేమో అనుకొని వేరే పనులు చేసుకోవాలనుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆ సినిమా మరేదో కాదు మిస్టర్ ఫర్‌ఫెక్ట్. అయితే సినిమా 4 రోజులు షూటింగ్ చేశాక.. అంత సంతృప్తికరంగా అనిపించలేదని అందుకే రకుల్‌ని తొలగించినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. బాధ అనిపించినా.. తను సినిమా ముఖ్యమని అందుకే అలా చేసినట్లు ఆయన చెప్పారు.

మరో బిగ్ ప్రాజెక్ట్ కూడా..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని లైఫ్ స్టోరీ ఆధారంగా తీసిన ‘MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఆమె చేతుల నుంచి జారిపోయింది. MS ధోని మూవీకి తనను సెలక్ట్ చేశాక, ఆ తర్వాత దిశా పటానీని తీసుకున్నట్లు వెల్లడించింది.

కాగా ప్రస్తుతం  రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పుడు అజయ్ దేవగన్‌తో కలిసి ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తోంది. మరో హిందీ మూవీ ‘మేరీ పత్నీ కా రీమేక్’ షూటింగ్ త్వరలో షురూ అవ్వనుంది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..