AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood : నార్త్ హీరోలు మన సినిమాల్లో విలన్లుగా కనిపిస్తే ఆ క్రేజే వేరప్పా…

హైదరాబాద్‌లో ల్యాండ్‌ కావడాన్ని నార్త్ స్టార్లు ప్రెస్టీజియస్‌గా ఫీలయ్యే టైమ్‌ వచ్చేసింది. అందుకే, ఇప్పుడు మన టాప్‌ హీరోల సినిమాల్లో విలన్‌ రోల్స్ అన్నీ హిందీ హీరోలతో ఫిల్‌ అవుతున్నాయి. శంకర్‌ డైరక్షన్‌లో రజనీకాంత్‌ 2.0ని అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన క్రేజ్‌ కన్నా, ఈ సినిమాలో నెగటివ్‌ రోల్‌లో అక్షయ్‌కనిపిస్తారనే మాట వైరల్‌ అయినప్పుడు కనిపించిన బజ్‌ వేరే లెవల్‌. మన హీరోల సినిమాల్లో, నార్త్ హీరోలు విలన్లుగా కనిపిస్తే ఎలాంటి క్రేజ్‌ వస్తుందో చెప్పిన సినిమా రోబో 2.ఓ.

Bollywood : నార్త్ హీరోలు మన సినిమాల్లో విలన్లుగా కనిపిస్తే ఆ క్రేజే వేరప్పా...
Bollywood
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Aug 19, 2023 | 12:30 PM

Share

ఎయిర్‌పోర్టులో మన స్టార్లు ముంబై ఫ్లైట్‌ ఎక్కితే ప్రమోషన్‌ వచ్చేసినట్టేననుకునే రోజులు ఇప్పుడు లేవు. హైదరాబాద్‌లో ల్యాండ్‌ కావడాన్ని నార్త్ స్టార్లు ప్రెస్టీజియస్‌గా ఫీలయ్యే టైమ్‌ వచ్చేసింది. అందుకే, ఇప్పుడు మన టాప్‌ హీరోల సినిమాల్లో విలన్‌ రోల్స్ అన్నీ హిందీ హీరోలతో ఫిల్‌ అవుతున్నాయి. శంకర్‌ డైరక్షన్‌లో రజనీకాంత్‌ 2.0ని అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన క్రేజ్‌ కన్నా, ఈ సినిమాలో నెగటివ్‌ రోల్‌లో అక్షయ్‌కనిపిస్తారనే మాట వైరల్‌ అయినప్పుడు కనిపించిన బజ్‌ వేరే లెవల్‌. మన హీరోల సినిమాల్లో, నార్త్ హీరోలు విలన్లుగా కనిపిస్తే ఎలాంటి క్రేజ్‌ వస్తుందో చెప్పిన సినిమా రోబో 2.ఓ.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

కేజీయఫ్‌లో సంజయ్‌దత్‌ విలన్‌గా నటిస్తున్నారని అన్నప్పుడు కూడా సేమ్‌ ఇలాంటి సీనే రిపీట్‌ అయింది. సంజయ్‌దత్‌కి మరో రేంజ్‌ ఎలివేషన్‌ ఇచ్చి దుమ్మురేపారు డైరక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ఇప్పుడు లియోలో అంతకు మించిన షాట్స్ తో నెవర్‌ బిఫోర్‌ అనిపించాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో ఉన్నారు లోకేష్‌ కనగరాజ్‌.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా హరిహరవీరమల్లు. నిధి అగర్వాల్‌ నాయికగా నటిస్తున్నారు. క్రిష్‌ డైరక్షన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌ కేరక్టర్‌లో నటించారు బాబీ డియోల్. పవన్‌ కల్యాణ్‌ ఫస్ట్ ప్యాన్‌ ఇండియన్‌ మూవీకి విలన్‌గా ఆ మాత్రం రేంజ్‌ ఉన్న ఆర్టిస్టు పడాల్సిందేనని హ్యాపీగా ఉన్నారు పవర్‌ ఫ్యాన్స్.

ఇటు నందమూరి అభిమానుల్లోనూ అదే జోష్‌ కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ దేవరలో సైఫ్‌ అలీఖాన్‌ కరడుగట్టిన విలన్‌ కేరక్టర్‌లో కనిపిస్తున్నారు. ఇటీవలే సైఫ్ లుక్ ను రిలీజ్ చేశారు దేవర టీమ్.

అటు భగవంత్‌ కేసరిలో బాలయ్యతో తలపడటానికి రెడీ అయ్యారు అర్జున్‌ రామ్‌ పాల్‌. ఒకప్పుడు తెలుగు సినిమాలను తక్కువగా చూసిన బాలీవుడ్‌ స్టార్లు, ఇప్పుడు మన సినిమాల్లో నార్త్ విలనిజాన్ని పోటాపోటీగా పండిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Arjun Rampal (@rampal72)