Kantara: కాంతార ఓటీటీ క్యాన్సిల్ ?.. మేకర్స్ మదిలో ఉన్న ఆలోచనలు అవేనా..

హీరో రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అదిరిపోయిందంటూ సినీ విశ్లేషకులు.. ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Kantara: కాంతార ఓటీటీ క్యాన్సిల్ ?.. మేకర్స్ మదిలో ఉన్న ఆలోచనలు అవేనా..
Kantara Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 30, 2022 | 12:20 PM

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది కన్నడ చిత్రం కాంతార. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీలో ఆడియన్స్ అడిక్ట్ అయ్యారు. హీరో రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అదిరిపోయిందంటూ సినీ విశ్లేషకులు.. ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం కాంతార చిత్రంపై పొగడ్తలు కురిపించారు. డైరెక్టర్ రిషబ్ ను ఇంటికి పిలిచి మరీ శాలువాతో సన్మానించారు. అనంతరం తనకు కాంతార చిత్రం ఎంతో నచ్చిందని.. అద్భుతంగా రూపొందించావంటూ రిషబ్ ను మెచ్చుకున్నారు తలైవా. ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 4న స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ నడిచింది.

ఈ సినిమా ప్రైమ్ లో నవంబర్ 4న స్ట్రీమింగ్ అవుతుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేశారని వార్తలు వినిపించాయి. అయితే లేటేస్ట్ అప్డేట్ ప్రకారం కాంతార ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సమయంలోకి వస్తే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ ఉంటుందని.. అందుకని కాస్త ఆలస్యంగా ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచినస్తున్నారట. దీంతో ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకున్నారట.

ఇక ఇదే విషయాన్ని ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్ నిర్వాహకులతో సంప్రదించనున్నాని తెలుస్తోంది. అయితే ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంటూ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. కర్ణాటక, కేరళ సరిహద్దులో ఉన్న ఆదివాసీల భూతకోల సంప్రదాయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.