Taraka Ratna : నందమూరి తారకరత్న చివరి వీడియో.. చూస్తే కన్నీళ్లు ఆగవు
నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
నందమూరి తారకరత్న ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. అశ్రునయనాల మధ్య తారకరత్న అంత్యక్రియలు జరిగాయి . వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, బరువెక్కిన గుండెలతో కుటుంబసభ్యులు మధ్య తారకరత్నకు తుది వీడ్కోలు పలికారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించి, 23 రోజులుగా మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. చివరకు శివరాత్రి రోజే శివైక్యం అయ్యారు తారకరత్న.
ఇదిలా ఉంటే తారకరత్నకు సంబంధించిన చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తారకరత్న తన కొడుకును ఒళ్ళో కూర్చోపెట్టుకొని తలనీలాలు తీయిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.