AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిగిలింది ఎండిన రక్తపు మరక మాత్రమే.. జులై 4నుంచి “ది హంట్” స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే

ప్ర‌ముఖ ఇన్వెస్టిగేటివ్‌ జ‌ర్న‌లిస్ట్ అనిరుద్ధ్య మిత్ర రాసిన పుస్త‌కం నైంటీ డేస్ ఆధారంగా తెరెకెక్కిన వెబ్ సిరీస్ ‘ది హంట్.. ది రాజీవ్‌ గాంధీ అసాసినేషన్‌ కేస్‌. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య, అనంతరం జరిగిన పరిణామాలను ఇందులో చూపించారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేక‌ర్ న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో.. రోహిత్ బ‌న‌వాలిక‌ర్‌, శ్రీరామ్ రాజ‌న్‌తో క‌లిసి ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

మిగిలింది ఎండిన రక్తపు మరక మాత్రమే.. జులై 4నుంచి ది హంట్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే
The Hunt
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2025 | 2:42 PM

Share

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’ను జాతీయ అవార్డు గ్రహీత నాగేష్ కుకునూర్ తెరకెక్కించారు. అనిరుధ్య మిత్ర బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ‘నైన్టీ డేస్’ నుంచి ఈ సిరీస్‌ను నగేష్ కుకునూర్ రూపొందించారు. ఆ కేసుని ఛేదించే క్రమంలో SITకి నాయకత్వం వహించిన వారు D.R. కార్తీకేయన్. ఆయన పాత్రను అమిత్ సియాల్ పోషిస్తున్నారు.

ఈ మేరకు అమిత్ సియాల్ మాట్లాడుతూ..‘ఒక నటుడికి ఇలాంటి ఓ గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం అదృష్టం.కార్తీకేయన్ లాంటి గౌరవప్రదమైన, దృఢ నిశ్చయం ఉన్న వ్యక్తిని పాత్రను బాధ్యతతో పోషించాల్సి ఉంటుంది. ఇది కేవలం రాజకీయ థ్రిల్లర్ కాదు. కార్తికేయన్ పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించే క్షణం ఉంటుంది. అక్కడ శరీరం అయితే కనిపించ లేదు. ఎండిన రక్తానికి సంబంధించిన పెద్ద గుర్తు మాత్రమే ఉంటుంది. ఒకరిని కోల్పోవడం.. అసలు వీడ్కోలు చెప్పే వీలు కూడా లేని ఘటన ఎంతగానో కదిలిస్తుంటుంది.

ఈ సిరీస్‌లో ఎస్పీ అమిత్ వర్మగా సాహిల్ వైద్, డిఎస్పీ రగోత్తమన్‌గా భగవతి పెరుమాళ్, డిఐజి అమోద్ కాంత్‌గా డానిష్ ఇక్బాల్, డిఐజి రాధావినోద్ రాజుగా గిరీష్ శర్మ, మరియు ఎన్ఎస్జి కెప్టెన్ రవీంద్రన్‌గా విద్యుత్ గార్గ్. ఈ సిరీస్‌లో షఫీక్ ముస్తఫా, అంజనా బాలాజీ, బి. సాయి దినేష్, శ్రుతి జయన్, గౌరీ మీనన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’ సిరీస్‌ జూలై 4న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.