- Telugu News Photo Gallery Cinema photos Varsha bollamma latest cute photos goes viral on social media
Varsha Bollamma: క్యూట్ క్యూట్ ఫొటోలతో కట్టిపడేస్తున్న వర్ష బొల్లమ్మ.. ఫొటోస్ అదిరిపోయాయి
చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయమైంది అందాల భామ వర్ష బొల్లమ్మ. ఆతర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుకుంది.ఈ సినిమాతో మంచి గుర్తింపై తెచ్చుకుంది.
Updated on: Jul 01, 2025 | 1:46 PM

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయమైంది అందాల భామ వర్ష బొల్లమ్మ. ఆతర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుకుంది.ఈ సినిమాతో మంచి గుర్తింపై తెచ్చుకుంది.

దళపతి విజయ్ విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది వర్ష. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో తన క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పక్కింటి అమ్మాయిలా కనిపించే రూపం, ఆకట్టుకునే నటనతో కుర్రకారును ఫిదా చేస్తోందీ బ్యూటీ. అతి తక్కువ సమయంలో మలయాళం, తమిళంతోపాటు తెలుగులోనూ నటిస్తూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటుందీ బ్యూటీ. చివరిగా సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరుపేరు భైరవకోన సినిమాలో నటించింది.

ఇక ఇప్పుడు నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా తర్వాత వర్షకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం పక్కాగా కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్ష రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని క్యూట్ క్యూట్ ఫోటోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడి ఇన్ స్టా ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి.