AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bro : అదిరిపోయిన బ్రో మూవీ ఫస్ట్ సాంగ్.. పవన్, తేజ్ ఇరగదీశారుగా..

విలక్షణ నటుడు, దర్శకుడు, రచయిత అయిన సముద్ర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింమ్స్ అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Bro : అదిరిపోయిన బ్రో మూవీ ఫస్ట్ సాంగ్.. పవన్, తేజ్ ఇరగదీశారుగా..
Bro
Rajeev Rayala
|

Updated on: Jul 08, 2023 | 4:18 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. విలక్షణ నటుడు, దర్శకుడు, రచయిత అయిన సముద్ర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింమ్స్ అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పవర్ స్టార్ , సాయి ధరమ్ తేజ్ కలిసి ఒక స్క్రీన్ పై సందడి చేస్తుండటంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు ఆకాశానికి చేరాయి.

తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మై డియర్ మార్కండేయ సాంగ్  అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.  ఈ పాటలో ఊర్వశి రౌతాల స్టెప్పులేసి కవ్వించింది.ఇక ఈ సినిమాలో ముద్దుగుమ్మలు కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

తమిళ్ లో మంచి విజయం సాధించిన వినోదయ సిత్తం సినిమాను రీమేక్ గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు, సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.