Baby : మెస్మరైజ్ చేస్తోన్న మెలోడీ.. వినేకొద్దీ వినాలనిపించే బేబీ మూవీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

మరిచిపోయిన మధురానుభూతుల్ని.. తట్టి మరీ లేపుతుంటాయి. భావోద్వేగాల్ని రగిలిస్తుంటాయి. లూప్లో వినేలా చేస్తుంటాయి. ఇక తాజాగా ఇదే పని చేస్తోంది ఇప్పుడో సాంగ్. అదే బేబీ సినిమాలోని 'ఓ రెండు మేఘాలిలా' సాంగ్!

Baby : మెస్మరైజ్ చేస్తోన్న మెలోడీ.. వినేకొద్దీ వినాలనిపించే బేబీ మూవీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
Baby
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 18, 2023 | 6:51 AM

అదేంటో కొన్ని పాటలు.. మన గుండల్ని నేరుగా తాకుతుంటాయి. మన మనసులో నాటుకుపోతుంటాయి. మన మెడదు పొరల్లో కూరుకుపోతుంటాయి. మరిచిపోయిన మధురానుభూతుల్ని.. తట్టి మరీ లేపుతుంటాయి. భావోద్వేగాల్ని రగిలిస్తుంటాయి. లూప్లో వినేలా చేస్తుంటాయి. ఇక తాజాగా ఇదే పని చేస్తోంది ఇప్పుడో సాంగ్. అదే బేబీ సినిమాలోని ‘ఓ రెండు మేఘాలిలా’ సాంగ్!

స్కూలుకు వెళ్లే రోజుల్లో..! తెలిసీతెలియని వయసులో.. కల్మషం లేని ఓ ఇద్దరి మనసులో పుట్టిన ప్రేమే ఈ పాట..! వారి ప్రేమ తాళూకు భావమే ఈ పాట. ఎస్ ! యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ విజయ్‌ బుల్‌గనిన్‌ స్వపరిచిన బేబీ సినిమాలోని ఈ పాట ఇప్పుడు అందరి మనసుల్ని దోచుకుంటోంది. ఈయన మెస్మరైజ్‌ మెలోడీకి.. అనంత్ శ్రీరామ్‌ అందించిన సాహిత్యం.. ప్రేమికులను తట్టి లేపుతోంది. తమ చిప్పటి ప్రేమను గుర్తుకు తెస్తోంది. యూట్యూబ్లో రికార్డ్‌ లెవల్ వ్యూస్‌ ను వచ్చేలా చేసుకుంటోంది.

ఇక ఆనంద్ దేవరకొండ, షార్ట్ ఫిల్మ్ ఫేం వైష్ణవి మధ్య… వారి మధ్య స్కూల్‌ డేస్‌లో పుట్టిన ప్రేమకు నేపథ్యంగా వచ్చినట్టు కనిపిస్తున్న ఈ సాంగ్.. ఎట్ ప్రజెంట్ యూట్యూబ్‌లో 8మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. మ్యూజిక్‌ ఫ్లాట్‌ ఫాం స్పాటిఫైలో ఏడు మిలియన్ వ్యూస్‌ను.. రిమైనింగ్ ప్లాట్ ఫాంలలో 24 మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. ఇలా ఓవల్ ఆల్‌గా లవబుల్ రెస్పాన్స్‌తో.. అంతటా హాట్ టాపిక్‌ అవుతోంది ఈ సాంగ్‌. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఈ మూవీ డైరెక్టర్‌ సాయి రాజేష్.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ చేశారు. దిస్ ఈజ్ అన్‌స్టాపబుల్ అంటూ.. తన హ్యాపీని షేర్ చేసుకున్నారు. దాంతో పాటే.. ఈ సాంగ్ 8 మిలియన్‌ పోస్టర్‌ను కూడా షేర్‌ చేశారు ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌.