Thalapathy Vijay: ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి అడుగు పెట్టిన దళపతి విజయ్.. గంటలోనే
హీరోలు మరీ అంత యాక్టివ్ గా ఉండకపోయినా సినిమా అప్డేట్స్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండరు. అలాగే ఇంకొంతమందికి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు.
సినిమా తరాలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. హీరోలు మరీ అంత యాక్టివ్ గా ఉండకపోయినా సినిమా అప్డేట్స్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండరు. అలాగే ఇంకొంతమందికి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు. ఆ లిస్ట్ లో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కూడా ఉన్నారు. దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. తుపాకీ సినిమా దగ్గర నుంచి విజయ్ సినిమాలన్నీ వందకోట్ల మార్క్ ను చాలా అవలీలగా క్రాస్ అవుతున్నాయి.
తాజాగా దళపతి విజయ్ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు. విజయ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను క్రియేట్ చేశారు. లియో సినిమాకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు విజయ్. ఇక విజయ్ ఇలా అకౌంట్ ఓపెన్ చేశారో లేదో అప్పుడు మిలియన్ ఫాలోవర్స్ వచ్చేశారు. ఒక గంటలోనే 1.1 మిలియన్ మంది విజయ్ ను ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా విజయ్ వారసుడు సినిమాతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ తో కలిసి లియో అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది .
View this post on Instagram