GOAT Review: ది గోట్ మూవీ రివ్యూ.. దళపతి విజయ్ సినిమా ఎలా ఉందంటే..

తమిళంలోనే కాదు.. తెలుగులోనూ వరస విజయాలు అందుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటున్న హీరో విజయ్. పైగా ఈయన ఈ మధ్యే రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో సినిమాలకు సెలవు ఇచ్చేయబోతున్నారు. రిటైర్ అయ్యేలోపు కెరీర్‌లో చివరగా చేసిన సినిమాల్లో గోట్ ఒకటి. అదిప్పుడు విడుదలైంది. మరి గోట్ సినిమా తెలుగు వర్షన్ పరిస్థితేంటి అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

GOAT Review: ది గోట్ మూవీ రివ్యూ.. దళపతి విజయ్ సినిమా ఎలా ఉందంటే..
Goat
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 05, 2024 | 12:45 PM

మూవీ రివ్యూ: ది గోట్

నటీనటులు: విజయ్, మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జయరాం, అజ్మల్ అమీర్, యోగిబాబు, ప్రేమ్ జీ అమరన్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని

ఎడిటర్: వెంకట్ రాజేన్

సంగీతం: యువన్ శంకర్ రాజా

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: వెంకట్ ప్రభు

నిర్మాతలు: కల్పతి ఎస్ అగోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్

తమిళంలోనే కాదు.. తెలుగులోనూ వరస విజయాలు అందుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటున్న హీరో విజయ్. పైగా ఈయన ఈ మధ్యే రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో సినిమాలకు సెలవు ఇచ్చేయబోతున్నారు. రిటైర్ అయ్యేలోపు కెరీర్‌లో చివరగా చేసిన సినిమాల్లో గోట్ ఒకటి. అదిప్పుడు విడుదలైంది. మరి గోట్ సినిమా తెలుగు వర్షన్ పరిస్థితేంటి అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

గాంధీ (విజయ్ జోసెఫ్) ఇండియన్ రా ఏజెంట్. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పని చేస్తుంటాడు. ఓ మిషన్ కోసం తన టీం (ప్రభుదేవా, ప్రశాంత్)తో కలిసి కెన్యా వెళ్లినపుడు అక్కడ ఆపరేషన్‌లో మాఫియా డాన్ మీనన్ (మైక్ మోహన్)ను చంపేస్తారు. ఆ తర్వాత మరో మిషన్ కోసం భార్య అను (స్నేహ), తన కొడుకు జీవన్‌ను తీసుకుని థాయ్‌లాండ్ వెళ్తాడు. అక్కడ వాళ్లపై అటాక్స్ జరుగుతాయి. ఆ ప్రమాదంలో గాంధీ కొడుకు జీవన్ చనిపోతాడు. కానీ కొన్నేళ్ళ తర్వాత తన పోలికలతో ఉన్న మరో వ్యక్తి సంజయ్ (విజయ్)ను కలుస్తాడు గాంధీ. చనిపోయిన తన కొడుకే మళ్లీ వచ్చాడని నమ్ముతాడు. అక్కడ్నుంచి కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయి..? అసలు అన్నేళ్లు కనిపించని కొడుకు ఒక్కసారిగా ఎక్కడ్నుంచి వచ్చాడు..? కొడుకు వచ్చిన తర్వాత గాంధీ జీవితం ఎలా మారిపోయింది అనేది గోట్ కథ..

కథనం:

విజయ్ సినిమా అంటేనే ఫ్యాన్స్‌కు సెలబ్రేషన్. ఎందుకంటే సినిమా కెరీర్‌లో ఆయన చరమాంకంలో ఉన్నారు. ఇక సినిమాలు చేయనని చెప్పారు. దాంతో చేసిన ఒకట్రెండు సినిమాలను ఫుల్లుగా సెలబ్రేట్ చేయాలని వాళ్లు ఫిక్సైపోయారు. అలాంటిది వచ్చిన సినిమా నచ్చితే అభిమానులకు అదే బోనస్. ది గోట్ రెండు కిక్కులు ఒకేసారి ఇచ్చింది వాళ్లకు. స్క్రీన్ ప్లే, రైటింగ్ ఓ సినిమాకు ఎంత ఇంపార్టెంట్ అనేది గోట్ మరోసారి చూపించింది. ఇదేం కొత్త కథ కాదు.. రొటీన్ కమర్షియల్ సినిమా. హీరో రా ఏజెంట్.. టెర్రరిస్టులను పట్టుకుంటాడు. ఆ తర్వాత రొటీన్ రివేంజ్ డ్రామా.. కానీ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ అంతా కాస్త కామెడీగా.. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులతో సాగిపోతుంది. ఆ కామెడీ మనకు బోర్ కొడుతుంది.. అదొక్కటే కాస్త మైనస్. సెకండాఫ్ మాత్రం ఎక్కడా తడబడలేదు.. ల్యాగ్ సీన్స్ ఉన్నా కథకు అవి అవసరం.. యంగ్ విజయ్ వచ్చిన తర్వాత కథ పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ తర్వాత కొన్ని ట్విస్టులు అదిరిపోయాయి. క్లైమాక్స్‌లో వచ్చే రెండు ట్విస్ట్స్ అయితే ఊహించడం కష్టం. అది ప్యూర్ వింటేజ్ వెంకట్ ప్రభు రైటింగ్ స్కిల్స్ అంతే. హీరోను విలన్‌గా చూపించడం.. నెగిటివ్ షేడ్స్ చివరి వరకు కంటిన్యూ చేయడం కష్టం. మంగత్తలో అది చేసి చూపించాడు వెంకట్ ప్రభు.. ఇక్కడ గోట్‌లో మరోసారి ప్రూవ్ చేసాడు. క్లైమాక్స్ 20 నిమిషాలు బాగా కుదిరింది.. ధోనీ ఫ్యాన్స్‌కు పూనకాలు లోడింగ్. గోట్‌లో ఎమోషన్‌ను మిక్స్ చేస్తూ.. ఎక్కడా ఫ్యాన్స్‌కు లోటు రాకుండా కమర్షియల్ అంశాలు కూడా బాగా బ్లెండ్ చేసాడు వెంకట్ ప్రభు. సినిమా లెంత్ కాస్త ఎక్కువే కానీ.. బాబోయ్ అనిపించేంత ల్యాగ్ సీన్స్ మాత్రం లేవు. వాళ్లకి హై ఇచ్చే మూవెంట్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఓరవాల్‌గా గోట్ ఫక్తు కమర్షియల్ సినిమా..

నటీనటులు:

విజయ్ యాక్టింగ్ బాగుంది.. రెండు పాత్రల్లోనూ అదరగొట్టాడు. ముఖ్యంగా యంగ్ విజయ్ కారెక్టర్ ట్రోల్ అవుతుందేమో అనుకుంటాం కానీ.. ఆ ఆలోచనే రాకుండా ఆ కారెక్టర్‌ను డిజైన్ చేసాడు వెంకట్ ప్రభు. అక్కడే ఆయన దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి జస్ట్ ఉందంతే. పాటలు, కొన్ని సీన్స్ కోసం. జయరాం, ప్రశాంత్, ప్రభుదేవా కారెక్టర్స్ బాగున్నాయి. స్నేహ, లైలా కూడా కొన్ని సీన్స్‌కే పరిమితం అయ్యారు. యోగిబాబు, ప్రేమ్ జీ అమరన్ రెండు మూడు చోట్ల నవ్వించారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

యువన్ శంకర్ రాజా పాటలు పెద్దగా ఆకట్టుకోవు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఎడిటింగ్ కాస్త వీక్.. కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి కానీ దర్శకుడు వెంకట్ ప్రభు ఛాయిస్‌కు ఎడిటర్ పనితనాన్ని తప్పు బట్టలేం. డైరెక్టర్ డిసిషన్ ఈజ్ ఫైనల్ కదా..! సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. వెంకట్ ప్రభు చాలా రోజుల తర్వాత మంచి స్క్రీన్ ప్లేతో వచ్చాడు. రొటీన్ కథ తీసుకున్నా.. తన మార్క్ స్టైల్ దానికి జోడించాడు. అక్కడే గోట్ స్వరూపం మారిపోయింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ది గోట్.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కాకపోయినా.. కిక్ ఇచ్చే పైసా వసూల్ కమర్షియల్ సినిమా..