హీరోయిన్‌ను ఏడిపించిన ఆకతాయిలు.. కాపాడిన స్టార్ హీరో అభిమానులు
సినీ సెలబ్రెటీలు ఎక్కువగా బయటకు రారు. షూటింగ్స్ లో ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా విదేశాలకు చెక్కేస్తూ ఉంటారు. అక్కడ షాపింగ్లు , లొకేషన్స్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు పబ్లిక్ ప్లేస్ లో బయటకు వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కు కూడా అదే పరిస్థితి ఎదురైంది.

సినీ సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానంగా హీరోయిన్స్ కు కూడా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంటున్నరు. ఇక హీరోయిన్స్ కు వీరాభిమానులు ఉంటారు. సోషల్ మీడియాలో హీరోయిన్స్‌కు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే సెలబ్రెటీలకు పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. పబ్లిక్ ప్లేస్‌లోకి వచ్చిన సమయంలో హీరోయిన్స్ పై కొంతమంది అభిమానులు అత్యుత్సాహం చూపిస్తుంటారు. హీరోయిన్స్‌ను టచ్ చేయాలనీ, ఫోటోలు దిగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా కొంతమంది ఆకతాయిల వల్ల ఇబ్బంది పడింది. పబ్లిక్ ప్లేస్‌లోకి వెళ్లిన ఆ హీరోయిన్ ను కొందరు ఆకతాయిలు ఇబ్బందిపెట్టారు. ఓ హీరో అభిమానులు వచ్చి ఆమెను రక్షించారు.
ఇది కూడా చదవండి : మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు.. యంగ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్
ఇంతకూ ఆమె ఎవరంటే.. తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది అందాల భామ నీమా రే. ఈ అమ్మడు తమిళ్ తో పాటు కన్నడ భాషలోనూ కొన్ని సినిమాలు చేసింది. దాంతో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ వచ్చింది. అభిమానులు కూడా భారీగా ఉన్నారు. దాంతో ఆమె ఎక్కడికి వెళ్లిన పెద్దెత్తున ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎగబడతారు. తాజాగా ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి :మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
నీమా రే నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ తమిళనాడులోని వెళ్లిమలై ప్రాంతంలో జరుగుతుంది. దాంతో నీమా రేను చూడటాన్ని ఆమె అభిమానులు కొందరు యువకులు అక్కడికి వచ్చారు. హీరోయిన్ ను చూడగానే ఆమెను ముట్టుకునేందుకు ఎగబడ్డారు. అలాగే కొందరు ఆకతాయిలు ఆమె చెయ్యి పట్టుకొని లాగారు. దాంతో అక్కడికి వచ్చిన దళపతి విజయ్ ఫ్యాన్స్ ఆ ఆకతాయిలను చెదరగొట్టారు. సినిమా కోసం వాడే కొరడాతో ఆ ఆకతాయిలను తరిమి కొట్టారు విజయ్ అభిమానులు. దళపతి విజయ్ అభిమానుల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ సంఘటనతో హీరోయిన్ చాలా భయపడిపోయిందని విజయ్ అభిమానులు తెలిపారు.
ఇది కూడా చదవండి : బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








