Thalapathy Vijay Birthday: ఒక్కోసినిమాకు వందలాది కోట్ల రెమ్యునరేషన్.. దళపతి విజయ్‌ ఆస్తుల లెక్కెంతో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ శనివారం (జూన్ 22) తన పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విజయ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా సినిమా రంగంలో దళపతి విజయ్ కు మూడు దశాబ్దాల చరిత్ర ఉంది.

Thalapathy Vijay Birthday: ఒక్కోసినిమాకు వందలాది కోట్ల రెమ్యునరేషన్.. దళపతి విజయ్‌ ఆస్తుల లెక్కెంతో తెలుసా?
Thalapathy Vijay Birthday
Follow us
Basha Shek

|

Updated on: Jun 22, 2024 | 9:16 AM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ శనివారం (జూన్ 22) తన పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విజయ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా సినిమా రంగంలో దళపతి విజయ్ కు మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ స్టార్ హీరో రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో విజయ్ కూడా ఒకరు. అయితే ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టారీ స్టార్ హీరో. రాజకీయ పార్టీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ బరిలోకి దిగనున్నాడు. ఈ కారణంగానే విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇది ఆయన సినీ అభిమానులను కలవరపరుస్తోంది. మరి ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషకం తీసుకుంటున్న దళపతి విజయ్ ఆస్తుల వివరాలేంటో తెలుసుకుందాం రండి.

దళపతి విజయ్ గతంలో ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు.అయితే 2019 నుండి ఆయన రేంజ్ పెరిగింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు 200 కోట్లు అందుకుంటున్నాడని టాక్. చివరి సినిమాకి ఏకంగా 250 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడని కోలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. కాగా దళపతి విజయ్ కు సుమారు 420 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని తెలుస్తోంది. విజయ్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా పలు కంపెనీల ప్రకటనల్లో నటిస్తూ సంపాదిస్తున్నాడు. కేవలం ప్రకటనల ద్వారానే ఏటా రూ.10 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా. కోకాకోలా, చెన్నై సూపర్ కింగ్స్ మొదలైన వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు విజయ్.

ఇవి కూడా చదవండి

విజయ్‌కి కార్లంటే విపరీతమైన క్రేజ్. ఆయన గ్యారేజ్ లో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. విజయ్ ఇంట్లో ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ఉంది. అది కాకుండా 1.30 కోట్ల విలువైన ఆడి ఏ8, 75 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ, 90 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6, 35 లక్షల విలువైన మినీ కూపర్ వంటి లగ్జరీ కార్లు విజయ్ గ్యారేజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాపై పూర్తి దృష్టి సారించాడు. ‘గోట్‌ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) పేరుతో తెరకెక్కుతోన్న ఈసినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. దళపతి విజయ్ 69వ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈరోజు దీనిపై అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.