AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో.. రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి.. రైలు, పట్టాల మధ్య ఇరుక్కుని ఓ టీవీ ఆర్టిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సొంత ఊరికి వచ్చిన ఆర్టిస్ట్.. తిరిగి హైదరాబాద్ వెళ్లే క్రమంలో రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఇంతలో ఈ దుర్ఘటన జరిగింది.

Telangana: అయ్యో.. రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి..
Jabardasth
Ram Naramaneni
|

Updated on: Jun 22, 2024 | 9:21 AM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి.. ట్రైన్, పట్టాల మధ్య ఇరుక్కుని ఓ టీవీ ఆర్టిస్టు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. చుంచుపల్లి మండలం నందాతండాలో మేదర మహ్మద్దీన్‌ కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు. భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌కు శుక్రవారం మార్నింగ్ వచ్చారు.‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌లో నుంచి ముందుకు కదులుతోంది.. ఆ సమయంలో ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే కాలు జారి కిందకు జారిపడటంతో ట్రైన్, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు.  గమనించిన తోటి.. ప్రయాణికులు చైన్ లాగడంతో లోకో పైలెట్ రైలును ఆపారు.

వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది.. మహ్మద్దీన్‌ను అతి కష్టం మీద బయటకు తీసి అంబులెన్స్‌లో కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెస్టులు చేసిన డాక్టర్లు..  మహ్మద్దీన్ నడుము, పక్కటెముకలకు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.  ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన వైద్యం ఖమ్మం తరలించాలని సూచించారు. వెంటనే తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో మహ్మద్దీన్ తుదిశ్వాస విడిచారు. డెడ్‌బాడీని సర్వజన ఆస్పత్రికి తరలించారు.. అక్కడ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ కంప్లైంట్‌తొ పోలీసులు కేసు నమోదు చేశారు.

మహ్మద్దీన్ టీవీ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు.. ఈటీవీ జబర్దస్త్‌ షో ద్వారా పాపులర్ అయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 50 ఎపిసోడ్‌లలో కనిపించారు. అయితే తనకు హైదరాబాద్‌లో షూటింగ్‌ ఉండటంతో.. ట్రైన్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అయితే విధి మరోలా తలవడంతో.. ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహ్మద్దీన్‌ ఆకస్మిక మరణంతో నందాతండాలో విషాదచాయలు అలుముకున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ ఇద్దరు కుమార్తెల్లో ఒకరిని డిగ్రీ, మరొకరిని పదోతరగతి  చదవిస్తున్నారు. మహ్మద్దీన్‌ ఇలా ప్రమాదవశాత్తు మరణించడంతో.. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Jabardasth Artist

Jabardasth Artist

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.