Sri Ramakrishna : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సీనియర్ డైలాగ్ రైటర్ మృతి.. 300కు పైగా సినిమాలకు మాటలు..

మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి (1995), సినిమా నుంచి.. జెంటిల్‌మన్ (1993), ఒకే ఒక్కడు (1999), అపరిచితుడు (2005), చంద్రముఖి (2005) వంటి డబ్బింగ్ సినిమాలకు డైలాగ్స్  రాశారు.. కానీ వయో సంబంధిత సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. చివరగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ సినిమాకు డైలాగ్స్ రాశారు. కొన్నిరోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నిన్న (ఏప్రిల్ 1న) రాత్రి మరణించారు.

Sri Ramakrishna : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సీనియర్ డైలాగ్ రైటర్ మృతి.. 300కు పైగా సినిమాలకు మాటలు..
Sri Ramakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 02, 2024 | 3:16 PM

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మాటల రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇండస్ట్రీలో దాదాపు 300లకు పైగా సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి (1995), సినిమా నుంచి.. జెంటిల్‌మన్ (1993), ఒకే ఒక్కడు (1999), అపరిచితుడు (2005), చంద్రముఖి (2005) వంటి డబ్బింగ్ సినిమాలకు డైలాగ్స్  రాశారు.. కానీ వయో సంబంధిత సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. చివరగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ సినిమాకు డైలాగ్స్ రాశారు. కొన్నిరోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నిన్న (ఏప్రిల్ 1న) రాత్రి మరణించారు. రామకృష్ణ మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు, సీనియర్ నటీనటులు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఈరోజు సాయంత్రం చెన్నైలోని సాలిగ్రామంలోని స్మశాన వాటికలో రామకృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తెలిపారు. రామకృష్ణ వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. రామకృష్ణ స్వస్థలం తెనాలి. కానీ 50 ఏళ్ల క్రితమే చెన్నైలో స్థిరపడిపోయారు. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. మాటల రచయితగానే కాకుండా బాలమురళీ ఏంఏ, సమాజంలో స్త్రీలాంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.

ప్రముఖ దర్శకులు మణిరత్నం, శంకర్ సినిమాలకు ఎక్కువగా రామకృష్ణ మాటలు రాసేవారు. సింగర్ మనోను సూపర్ స్టార్ రజినీకాంత్ కు పరిచయం చేశారు రామకృష్ణ. ఆ తర్వాత రజినీ సినిమాలకు ఎక్కువగా మనో డబ్బింగ్ చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.