April OTT Movies 2024: వేసవిలో వినోదాల విందు.. ఏప్రిల్‏లో ఓటీటీలో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే..

కొన్నాళ్ల క్రితం థియేటర్లలో పాజిటివ్ టాక్ అందుకుని సక్సెస్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ కాకుండా ఈ ఏప్రిల్ నెలలో మొత్తం తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఏప్రిల్ నెలలో రాబోయే సినిమాలు ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.

April OTT Movies 2024: వేసవిలో వినోదాల విందు.. ఏప్రిల్‏లో ఓటీటీలో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే..
Upcoming Movies
Follow us

|

Updated on: Apr 02, 2024 | 3:53 PM

వేసవి కాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో రెండు వారాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు రానున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీల్లో అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. కొత్త కంటెంట్.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్.. కామెడీ ఎంటర్టైనర్స్ అడియన్స్ ముందుకు రానున్నాయి. కొన్నాళ్ల క్రితం థియేటర్లలో పాజిటివ్ టాక్ అందుకుని సక్సెస్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ కాకుండా ఈ ఏప్రిల్ నెలలో మొత్తం తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఏప్రిల్ నెలలో రాబోయే సినిమాలు ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.

1. భీమా.. మ్యాచో స్టార్ గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా భీమా. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2024 ఏప్రిల్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా 5 భాషలలో అందుబాటులో ఉంటుంది.

2. గామి.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గామి. ఇందులో చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యింది. ఇందులో శంకర్ అనే అఘోర పాత్రలో నటించాడు విశ్వక్. ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫామ్ జీ5లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

3. చారి 111 టాలీవుడ్ హాస్యనటుడు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చారి 111. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించిన ఈ స్పై కామెడీ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఏప్రిల్ లోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

4. ఓం భీమ్ బుష్.. విలక్షణ నటుడు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఓం భీమ్ బుష్. మార్చి 22న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

5. లంబసింగి.. బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య, భరత్ రాజ్ జంటగా నటించిన చిత్రం లంబసింగి. మార్చి 15న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్డ్స్ టాక్ అందుకుంది. ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే థియేటర్లలో ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్