Pushpa 2: పుష్ప 2 అప్డేట్ వచ్చేసింది.. బన్నీ ఫ్యాన్స్‏‏కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్..

ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప రాజ్ లుక్ మూవీపై ఓ రేంజ్ క్యూరియాసిటిని కలిగించింది. చాలాకాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పటికీ సరైన అప్డేట్స్ రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేసిన అభిమానులకు ఎట్టకేలకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ముందుగా చెప్పినట్లుగానే ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన టీజర్ అదిరిపోయింది.

Pushpa 2: పుష్ప 2 అప్డేట్ వచ్చేసింది.. బన్నీ ఫ్యాన్స్‏‏కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్..
Pushpa 2
Follow us

|

Updated on: Apr 02, 2024 | 4:13 PM

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప రాజ్ లుక్ మూవీపై ఓ రేంజ్ క్యూరియాసిటిని కలిగించింది. చాలాకాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పటికీ సరైన అప్డేట్స్ రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేసిన అభిమానులకు ఎట్టకేలకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ముందుగా చెప్పినట్లుగానే ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్పరాజ్ కాలి పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  పుష్ప 2 షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చినా.. నెట్టింట మాత్రం ఈ సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడుతుందని రూమర్స్ నడుస్తున్నాయి. దీంతో ప్రతి అప్డేట్ లోనూ గ్రాండ్ రిలీజ్ ఆగస్ట్ 15 అంటూ నొక్కి చెబుతుంది మూవీ టీం.

గతంలో రిలీజ్ అయిన పుష్ప సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు పుష్ప 2ను మరింత జాగ్రత్తగా అడియన్స్ అంచనాలకు మించి ఉండేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుందని.. అలాగే సమంత గెస్ట్ అప్పీయరెన్స్ ఉందని టాక్ నడుస్తుంది. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్