మాధవన్‌కు తగిన పాత్రలు మనవాళ్లు ఇవ్వలేకపోతున్నారా !

తమిళ నటుడు మాధవన్‌కు నీటిని పోలిన గుణం ఉంది. నీరు ఏ పాత్రలో అయినా ఒదిగిపోయినట్టే, మాధవన్ చేసే ప్రతి క్యారెక్టర్ లోనూ జీవిస్తాడు.

మాధవన్‌కు తగిన పాత్రలు మనవాళ్లు ఇవ్వలేకపోతున్నారా !
Follow us

|

Updated on: Oct 12, 2020 | 9:38 PM

తమిళ నటుడు మాధవన్‌కు నీటిని పోలిన గుణం ఉంది. నీరు ఏ పాత్రలో అయినా ఒదిగిపోయినట్టే, మాధవన్ చేసే ప్రతి క్యారెక్టర్ లోనూ జీవిస్తాడు. అతడి ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ తొలినాళ్లలో చేసిన  ‘సఖి’ తోనే ఆ విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. మణిరత్నం సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఆయన యాక్ట్ చేశారు. ఇక అక్కడి నుంచి గత రెండు దశాబ్దాల్లో ఎన్నో విభిన్న పాత్రలో ప్రేక్షకులను అలరించారు.  హిందీ చిత్ర సీమలో కూడా రంగ్‌దె బసంతి, గురు లాంటి చిత్రాల్లో పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఐతే ఇంత పరిణితి చెందిన నటుడ్ని టాలీవుడ్ సరిగ్గా వాడుకోవడం లేదన్న అనుమానం వ్యక్తమవుతోంది. డబ్బింగ్ చిత్రాల ద్వారా  మాధవన్ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని అతణ్ని డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటింపజేద్దామని గతంలోనే చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ తనకు తెలుగు మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇక్కడ నటించలేనని చెప్పేశాడు. కానీ ఈ మధ్య ఆయన మనసు మార్చుకుని… ‘సవ్యసాచి’లో విలన్ పాత్ర చేశారు. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేదు.  ( పిల్లి పిల్ల‌ అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..! )

ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని అనుష్కతో కలిసి ‘నిశ్శబ్దం’లో నటించాడు మాధవన్. కానీ పాత్ర సినిమాలో అంత ప్రాధాన్యం ఉన్నదిగా అనిపించలేదు. ఎన్నో గొప్ప రోల్స్ చేసిన ఆయన స్థాయికి తగ్గ రోల్ కాదేమో అనిపించింది. ఇప్పటికైనా దర్శకులు, రచయితలు మేల్కోని అటువంటి విలక్షణ నటుడికి మంచి పాత్రలు రాయాల్సి ఉంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.