Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు….

బిగ్ బాస్ షో వివాదం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా ఈ రియాల్టీ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది.  బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చెయ్యాలంటూ.. HRCకి హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

Bigg Boss:  బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు....
Bigg Boss 7 Telugu
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 20, 2023 | 1:49 PM

బిగ్ బాస్ షో వివాదం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా ఈ రియాల్టీ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది.  బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చెయ్యాలంటూ.. HRCకి హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద చేసిన వీరంగం అంతా ఇంతా కాదన్నారు. ప్రైవేట్ వాహనాలపై దాడులు చేయడం మాత్రమే కాకుండా.. ప్రభుత్వ ఆస్తులు సైతం ధ్వంసం చేశారు. జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. అయితే నాగార్జునపై కేసు నమోదు చెయ్యాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు న్యాయవాది అరుణ్. బిగ్ బాస్ నిర్వాహకులు సైతం నిర్లక్ష్యంగా వహించారని.. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశానన్నారు.

మరోవైపు బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ పరారీ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఫోన్ స్విఛాఫ్ చేశాడంటూ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి..ఐతే తాజాగా దీనిపై ప్రశాంత్ రియాక్ట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్‌ ఇంట్లోనే ఉన్నట్లు వీడియో విడుదల చేశారు. ప్రశాంత్‌ ఎక్కడికి వెళ్లలేదని నిన్న అయ్యప్ప పడిపూజకు వెళ్లాడంటున్నారు కుటుంబసభ్యులు.

మరోవైపు పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని..కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదని ఆరోపించారు. FIR కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలి అని చెబుతున్నట్లు వివరించారు.FIR కాపీ లేకపోవడంతో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తే తెలుస్తుందన్నారు అడ్వకేట్ రాజేష్ కుమార్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!