AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi Birthday: ‘మీ సంకల్పం, శ్రమ, పట్టుదల ఎందరికో ఆదర్శం’.. చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్..

విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం.. అపజయం వచ్చిన కుంగిపోవడం తెలియని హీరో. నటన అంటే ఇష్టం.. సినిమా అంటే ఆయనకు ప్యాషన్. అందుకే ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేస్తూ ఇప్పటికీ అభిమానులను తన సినిమాలతో అలరించాలని తాపత్రయపడుతుంటారు.

Megastar Chiranjeevi Birthday: 'మీ సంకల్పం, శ్రమ, పట్టుదల ఎందరికో ఆదర్శం'.. చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 22, 2023 | 1:09 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజు. నటనపై ఆసక్తి ఉండి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎందరో నటీనటులకు ఆయనే స్పూర్తి. అవమానాలను ఎదుర్కొని స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన అసామాన్యుడు చిరంజీవి. తనపై ఎవరెన్ని విమర్శలు చేసిన.. చిరునవ్వుతో సర్దుకుపోయి.. తన పని తాను చేసుకుపోయే మంచి మనసున్న వ్యక్తి. విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం.. అపజయం వచ్చిన కుంగిపోవడం తెలియని హీరో. నటన అంటే ఇష్టం.. సినిమా అంటే ఆయనకు ప్యాషన్. అందుకే ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేస్తూ ఇప్పటికీ అభిమానులను తన సినిమాలతో అలరించాలని తాపత్రయపడుతుంటారు. నవతరం నటీనటులకు, డైరెక్టర్లకు నటనలో ఎన్నో సలహాలు ఇస్తూ.. వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సాహిస్తూ వెన్నంటి నిలబడే గొప్ప వ్యక్తి. అందుకే ఇండస్ట్రీలో చిరు అంటే అభిమానం ఉండని లేరు. కేవలం హీరోగానే కాదు.. సామాజిక సేవలోనూ చిరు ముందుంటారు. ముఖ్యంగా సినీ కార్మికులకు.. నటీనటులకు తనవంతు సాయం చేస్తూ వారిని కష్టాల్లో ఆదుకుంటారు. ఈరోజు (ఆగస్ట్ 22) చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరుతో అనుబంధం ఉన్నవారు.. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

చిరంజీవికి పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్..

ఇవి కూడా చదవండి

“అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాకా లక్షలాది మందికి స్పూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయితీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి, ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య ” అంటూ ట్వీట్ చేశారు.

‏చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బర్త్ డే విషెస్ తెలిపారు.

“స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి సినీ అభిమానుల హృదయాలలో చిరంజీవిగా చిరస్థానాన్ని పదిలపరచుకున్న మెగాస్టార్. @KChiruTweets గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ పరిశ్రమ భవిష్యత్తును, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు… నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.” అంటూ ట్వీట్ చేశారు.

చిరంజీవి బర్త్ డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  నందమూరి అభిమానులు సైతం చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

చిరంజీవి బర్త్ డే సందర్భంగా  ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా చిరుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ అందమైన ఫోటో పంచుకున్నారు.

చిరంజీవి బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ట్విట్టర్ వేదికగా చిరుకు  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కాలం మారుతూనే ఉంటుంది, సినిమాలు వస్తూనే ఉంటాయి, తరాలు మారుతూ ఉంటాయి, సినిమా కదులుతూనే ఉంటుంది..
కానీ స్థిరంగా ఉండే ఒక ప్రభావం ఉంది."మెగాస్టార్" అంటూ హీరో కార్తికేయ చిరుకు బర్త్ డే విషెస్ తెలిపారు. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.