AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి 30 ఏళ్లుగా డూప్‌గా నటిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా..?

సినిమా అంత హీరోనే కనిపించినా.. కొన్ని రిస్కీ ఫైట్స్ లాంటివి డూప్స్ చేస్తూ ఉంటారు. అచ్చం తమలాగే ఉండే వారిని సినిమాల్లో నటింపజెసి విజయాలను అందుకుంటూ ఉంటారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమాల్లో డూప్ ను వాడుకుంటూ ఉంటారు. ఎమోషనల్ సీన్స్, డ్యాన్స్ లాంటివి తానే చేసిన రిస్కీ ఫైట్స్.. యాక్షన్ సీన్స్ లలో డూప్ ను వాడుతూ ఉంటారు. అయితే మెగాస్టార్ కు డూప్ గా నటిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా..?30 ఏళ్లుగా డూప్ గా నటిస్తున్నాడు ఓ వ్యక్తి. అతని పేరు ప్రేమ్ కుమార్.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి 30 ఏళ్లుగా డూప్‌గా నటిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా..?
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Aug 22, 2023 | 12:15 PM

Share

ఇప్పుడు కాదుకానీ కొంతకాలం క్రితం వరకు చాలా మంది హీరోలు ఫైట్స్.. డాన్స్‌లలో డూప్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. సినిమా అంత హీరోనే కనిపించినా.. కొన్ని రిస్కీ ఫైట్స్ లాంటివి డూప్స్ చేస్తూ ఉంటారు. అచ్చం తమలాగే ఉండే వారిని సినిమాల్లో నటింపజెసి విజయాలను అందుకుంటూ ఉంటారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమాల్లో డూప్ ను వాడుకుంటూ ఉంటారు. ఎమోషనల్ సీన్స్, డ్యాన్స్ లాంటివి తానే చేసిన రిస్కీ ఫైట్స్.. యాక్షన్ సీన్స్ లలో డూప్ ను వాడుతూ ఉంటారు. అయితే మెగాస్టార్ కు డూప్ గా నటిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా..? చిరంజీవికి దాదాపు 30 ఏళ్లుగా డూప్ గా నటిస్తున్నాడు ఓ వ్యక్తి. అతని పేరు ప్రేమ్ కుమార్.

ప్రేమ్ కుమార్ అచ్చం చిరంజీవి పోలికలతోనే ఉంటారు. సడన్ గా చూస్తే చిరునే అనుకుంటారు. ఈయన రికార్డింగ్‌ డ్యాన్సర్‌గా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ప్రేమ్ కుమార్ సినీ ప్రయాణం రికార్డింగ్ డాన్స్ ల నుంచే మొదలైంది. నిజానికి ప్రేమ్ కుమార్ అక్కినేని ఫ్యాన్. కానీ  స్నేహితుల ప్రోత్సాహంతో చిరంజీవిలా డాన్స్ చేయడం ఆయనలా నటించడంతో మెల్లగా మెగాస్టార్ ఫ్యాన్ గా మారిపోయాడు.Prem Kumar

ప్రేమ్ కుమార్ ఆరేళ్ళ వయసు నుంచి స్టేజ్ షోలు చేసేవాడు. సినిమా పాటలకు ఎక్కువగా డాన్స్ చేసేవాడు. అలా కాలేజ్ లో మెగాస్టార్ చిరంజీవి ఇందువదన సాంగ్ కు డాన్స్ చేశారు. చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టర్ చిరంజీవి నటించిన ఛాలెంజ్‌ సినిమాలో నటించాడు ప్రేమ్ కుమార్. రాక్షసుడు, మరణ మృదంగం సినిమాల్లో చిరు డూప్‌గా నటించాడు. ఆ తర్వాత కొన్నాళ్ల వరకు ప్రేమ్ కుమార్ కు సినిమా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత పెళ్లి కాని ప్రసాద్‌ అనే సినిమాలో చిరంజీవిలా నటించాడు. అలాగే సైరా నరసింహారెడ్డి సినిమాలో మెగాస్టార్ కు డూప్ గా నటించాడు ప్రేమ్ కుమార్. ఇలా దాదాపు 30 ఏళ్లుగా చిరంజీవి డూప్ గా నటిస్తున్నారు ప్రేమ్ కుమార్. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న అప్ కమింగ్ మూవీస్ లో కూడా ప్రేమ్ కుమార్ డూప్ గా నటించే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.