వైద్యానికి కూడా డబ్బులేక.. అత్యంత దీన స్థితిలో ప్రముఖ నటి మృతి..!

| Edited By: Ravi Kiran

Aug 07, 2023 | 3:57 PM

వెండితెరపై సింధు పలు చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేశారు. బాలనటిగా తెరంగెట్రం చేసిన సింధు ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా వసంతబాలన్ తెరకెక్కించిన చిత్రం 'అంగడి తేరు' లో సింధు బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. 'నాడోడిగళ్' మువీ కూడా మంచి గుర్తింపు తెచ్చింది. ఆమె మరణ వార్త తెలియడంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు..

వైద్యానికి కూడా డబ్బులేక.. అత్యంత దీన స్థితిలో ప్రముఖ నటి మృతి..!
Actress Sindhu
Follow us on

వెండితెరపై తనదైన నటనతో అలరించిన నటి సింధూ (44) అనారోగ్యంతో మృతి చెందారు. గతకొంత కాలంగా బెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె సోమవారం (ఆగస్టు 7) వేకువ జామున 2.15 గంటలకు వలసరవక్కంలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. తమిళనాడు కిలిపక్కంలోని ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్‌ (రొమ్ము క్యాన్సర్‌) చికిత్స పొందుతున్న ఆమె ఆసుపత్రి ఖర్చులను భరించలేక గత కొంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో సింధు ఈ రోజు ఉదయం చెన్నైలోని . నటి సింధూ మరణం పట్ల కోలీవుడ్‌ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వెండితెరపై సింధు పలు చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేశారు. బాలనటిగా తెరంగెట్రం చేసిన సింధు ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా వసంతబాలన్ తెరకెక్కించిన చిత్రం ‘అంగడి తేరు’ లో సింధు బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ‘నాడోడిగళ్’ మువీ కూడా మంచి గుర్తింపు తెచ్చింది. ఆమె మరణ వార్త తెలియడంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రముఖ నటులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పేద కుటుంబంలో పుట్టిన సింధుకు 14 ఏళ్లకే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆ తర్వాత ఏడాదికే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. నటి అయినప్పటికీ సింధుకు ఆర్ధిక సమస్యలు తప్పలేదు. కుమార్తె బాధ్యతలు, అయిన వాళ్ల వెన్నుపోటు నడుమ క్యాన్సర్ మహమ్మారి ఆమె జీవితాన్ని మరింత క్లిష్టంగా మార్చింది. ఆమె పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పి కన్నీరుపెట్టుకున్నారు. 2010లో తెలుగు హీరోయిన్ అంజలి నటించిన ‘షాపింగ్‌ మాల్’ సినిమాలో కూడా సింధు ఓ పాత్రలో నటించారు. ఆ తర్వాత పలు సినిమాల‍్లో ఆమె సహాయ పాత్రలు చేశారు.

ఇవి కూడా చదవండి

2020లో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన సింధూ పెద్దగా కూడబెట్టలేదు. దీంతో క్యాన్సర్‌ చికిత్సకు డబ్బులేక చివరి రోజుల్లో నరకయాతన అనుభవించారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్న నటి సింధు కొన్నిరోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సరైన చికిత్స అందిఉంటే నటి బతికి ఉండేదని, ఆర్ధిక ఇబ్బందుల వల్లే ఆమె అకాల మరణం చెందిందని పలువురు అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.