Vijay Sethupathi: పుష్ప 2లో పవర్ ఫుల్ పాత్రలో విజయ్ సేతుపతి.. క్లారిటీ ఇచ్చిన టీమ్..

ఉప్పెన, మాస్టర్ సినిమాలతో విలన్ పాత్రలలో అదరగొట్టారు విజయ్ సేతుపతి. ముఖ్యంగా ఉప్పెన చిత్రంలోని రాయనం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇక పుష్ప 2లోనూ పవర్ ఫుల్ విలన్ పాత్రలో విజయ్ సేతుపతి

Vijay Sethupathi:  పుష్ప 2లో పవర్ ఫుల్ పాత్రలో విజయ్ సేతుపతి.. క్లారిటీ ఇచ్చిన టీమ్..
Pushpa 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 14, 2022 | 9:16 PM

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బన్నీ నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్ స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించగా.. మలయాళీ స్టార్ ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటించారు. ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప 2 కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే పుష్ప సెకండ్ పార్ట్ పట్టాలెక్కనుంది. అయితే గత కొద్దిరోజులుగా ఈ మూవీలో మరో ఇద్దరు స్టార్స్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi).

ఉప్పెన, మాస్టర్ సినిమాలతో విలన్ పాత్రలలో అదరగొట్టారు విజయ్ సేతుపతి. ముఖ్యంగా ఉప్పెన చిత్రంలోని రాయనం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇక పుష్ప 2లోనూ పవర్ ఫుల్ విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ సేతుపతి ప్రచారకర్త యువరాజ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. విజయ్ సేతుపతి కేవలం షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో మాత్రమే ప్రతినాయకుడిగా నటించనున్నాడని.. మరే సినిమాలో నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో పుష్ప2లో విజయ్ సేతుపతి నటించడం మరోసారి రూమర్ మాత్రమే అన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.