Drishyam 3: దృశ్యం3 వచ్చేస్తోంది.. ఈసారి కథకు ముగింపు పడ్డట్లేనా.? ఇంట్రెస్టింగ్‌గా ఫస్ట్‌ లుక్‌..

Drishyam 3: భాషతో సంబంధం లేకుండా రీమేక్‌ అయిన అన్ని భాషల్లో విజయం సాధించిన అతికొన్ని చిత్రాల్లో దృశ్యం ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం..

Drishyam 3: దృశ్యం3 వచ్చేస్తోంది.. ఈసారి కథకు ముగింపు పడ్డట్లేనా.? ఇంట్రెస్టింగ్‌గా ఫస్ట్‌ లుక్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 14, 2022 | 8:43 PM

Drishyam 3: భాషతో సంబంధం లేకుండా రీమేక్‌ అయిన అన్ని భాషల్లో విజయం సాధించిన అతికొన్ని చిత్రాల్లో దృశ్యం ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. మాతృక మలయాళంలో మోహనల్‌లాల్‌, మీనా జోడిగా వచ్చిన చిత్రం తెలుగులో విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటించాడు.

అనుకోని కష్టాల్లో చిక్కిన తన కూతురు, కుటుంబాన్ని ఓ తండ్రి ఎలా కాపాడుకున్నాడు అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ కథ అసంపూర్తిగానే ముగిసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి మూడో పార్ట్‌ తెరకెక్కుతోంది.

దృశ్యం3 కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. మలయాళంలో తొలుత షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా రీమేక్‌ తెలుగులో ఎప్పుడన్న దానిపై తెలియాల్సి ఉంది. ‘దృశ్యం 3: ది కంక్లూజన్‌’ పేరుతో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో మోహన్‌లాక్‌ చేతులకు సంకెళ్లు వేసినట్లు చూపించారు. ది కంక్లూజన్‌ అని పేర్కొనడంతో ఈ పార్ట్‌లో మేకర్స్‌ కథకు ముగింపు పలకనున్నారా.? అన్న వార్తలకు బలం చేకూరినట్లైంది. మరి థార్డ్‌ పార్ట్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు, ఎలాంటి సస్పెన్స్‌లు ఉండనున్నాయో తెలియాలంటే సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?