Mass Jathara Movie: రజనీ, బచ్చన్ తర్వాత రవితేజనే.. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు సగటు సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జాతర'. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి మాస్ జాతర సినిమాలో జోడీ కట్టారు రవితేజ, శ్రీలీల. భాను భోగవరపు తెరకెకించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ శుక్రవారం (అక్టోబర్ 31)న ఈ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘రవితేజ గారికి నేను ఫ్యాన్. ఇది నా ఫ్యాన్ బాయ్ మూవెంట్. మా ఇంట్లో రవితేజ టాపిక్ వస్తే నవ్వు కాదు. ఇంకా పెద్ద సెలబ్రేషన్ ఉంటుంది. రవితేజ అంటే పెద్ద ఎక్స్‌ప్లోజివ్. తమిళంలో సబ్ టైటిల్స్ లేకుండా ఎంజాయ్ చేయగలిగే సినిమాలు రవితేజవి. రజినీ, బచ్చన్ గారి తర్వాత ఆ కామిక్ టైమింగ్ రవితేజలో ఉంది. మా తమ్ముడు కార్తి కెరీర్‌కు విక్రమార్కుడు రీమేక్ సిరుతై కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ గా నిలిచింది. నాగవంశీ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఎల్లపుడూ మీ ప్రేమ కావాలి’ అని సూర్య చెప్పుకొచ్చారు.
ఇదే సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. ‘తమ్ముళ్లూ మీరిలా అరిస్తే నేనేం మాట్లాడాలో మరిచిపోతాను. సినిమా చాలా బాగా వచ్చింది. భీమ్స్ ఇంత ఎమోషన్ ఏంటావయ్యా ననువ్వు.. నీ ఎమోషన్ తగలెయ్య.. స్క్రీన్ మీద ఇరగదీయబోతున్నాడు మా వాడు.. సౌండ్‌తో సినిమా చూసాను బాగుంది.. నవీన్ చంద్ర ఇలా కూడా చేస్తాడా అనేలా శివుడు పాత్ర ఉంటుంది.. ఈ సినిమా తర్వాత నెక్ట్స్ లెవల్‌కు వెళ్తాడు.. రాజేంద్రప్రసాద్ గారితో నాది సూపర్ కాంబినేషన్.. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, రాజా ది గ్రేట్ తర్వాత మా కాంబో అదిరిపోతుంది.. శ్రీలీల క్యారెక్టర్ బాగుంది.. కొత్తగా ఉంటుంది.. ఫుల్ మాసీగా ఉంటుంది. సూర్య గురించి నేనేం చెప్తాను.. థ్యాంక్యూ. భాను భోగవరపు మంచి మ్యాటర్ ఉన్న డైరెక్టర్. తమ్ముళ్లూ మొన్నటి వరకు మీకు చిరాకు తెప్పించాను.. ఈ సినిమాతో అలా జరగదు’ అని ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాడు రవితేజ
ఇదే ఈవెంట్ లో శ్రీలీల మాట్లాడుతూ.. ‘ధమాకా తర్వాత నేను మళ్ళీ వస్తున్నాను అన్నపుడు.. అమ్మడు మంచి సినిమాతో వస్తున్నావ్ అన్నారు. ఈ ఇయర్ మీకు బాగా కష్టాలు వచ్చాయి. ఇంజూరీ, ఫ్యామిలీలో సమస్యలు అవన్నీ ఉన్నా కూడా పాజిటివ్‌గా ఎలా ఉండాలో మీ నుంచే నేర్చుకున్నా. సీన్స్‌లో ఏకవచనంతో డైలాగ్స్ ఉన్నాయి.. నేను చెప్పడానికి ఇబ్బంది పడుతున్నపడు నాకు చాలా సాయం చేశారు. సూర్య గారూ నేను మీకు పెద్ద ఫ్యాన్ మీకు.. వెంకీ అట్లూరి సినిమాకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఊర నాటు ఉంటుంది.. ముందులా ఉండదు.. అందరికీ నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చింది.








