AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya Birthday :సూర్య అభిమానులకు నిరాశ.. వీడియో సాంగ్ తో స‌రిపెట్టుకోవ‌డమే

కోవిడ్-19 వ్యాప్తి, సంక్షోభ ప‌రిస్థితుల కారణంగా తమిళ సీనియ‌ర్​ హీరో సూర్య నటించిన‌ 'ఆకాశమే నీ హద్దురా' మూవీ రిలీజ్ వాయిదా పడింది.

Suriya Birthday :సూర్య అభిమానులకు నిరాశ.. వీడియో సాంగ్ తో స‌రిపెట్టుకోవ‌డమే
Ram Naramaneni
|

Updated on: Jul 20, 2020 | 7:58 AM

Share

కోవిడ్-19 వ్యాప్తి, సంక్షోభ ప‌రిస్థితుల కారణంగా తమిళ సీనియ‌ర్​ హీరో సూర్య నటించిన‌ ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే సోష‌ల్ మీడియాలో ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేసింది. జులై 23 సూర్య బ‌ర్త్ డే సంద్భంగా ఈ చిత్ర ట్రైలర్​ను రిలీజ్​ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే మూవీ యూనిట్ అభిమానులకు షాకిచ్చింది.

సూర్య బర్త్​డే రోజున ట్రైలర్​ను రిలీజ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ఆ రోజున ‘కాటుక కన్నులే’ అనే నిమిషం నిడివిగల వీడియో సాంగ్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మూవీ యూనిట్ అఫిషియ‌ల్ గా ప్రకటించింది. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్, టాలీవుడ్​ విలక్షణ నటుడు మంచు మోహన్​బాబు కీ రోల్ పోషిస్తున్నారు. లేడీ డైరెక్ట‌ర్ సుధా కొంగర మూవీని తెర‌కెక్కించ‌గా.. సూర్య, బాలీవుడ్​ నిర్మాత గుణీత్​ మోంగ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. జీవీ ప్రకాశ్​ సంగీతం అందిస్తున్నాడు. గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్ లేక కెరీర్ లో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నాడు సూర్య‌. ‘ఆకాశమే నీ హద్దురా’ అత‌డికి బ్రేక్ ఇస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.