ఫస్ట్ ఫేజ్ : సినీ కార్మికులకు రూ.కోటిన్నర విరాళం ఇచ్చిన సూర్య
నటుడు సూర్య తన గొప్ప మనసు చాటుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు.
నటుడు సూర్య తన గొప్ప మనసు చాటుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. దక్షిణ సినీ కార్మికుల సమాఖ్యలోని కార్మికులను ఆదుకునేందుకు రూ.1.5 కోట్లు డొనేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
తన కొత్త చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ ఓటీటీలో రానుందని చెప్పిన సూర్య.. తర్వాతి రెండు చిత్రాలు మాత్రం థియేటర్లలోనే రిలీజ్ చేస్తానని హామీ ఇచ్చారు. ‘ఆకాశం నీ హద్దురా’ బిజినెస్ ద్వారా వచ్చే రూ.5 కోట్లను కరోనా వ్యాప్తి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారికి అందిస్తానని సూర్య గతంలోనే హామి ఇచ్చారు. ఆయన ప్రకటించిన డొనేషన్‌లో ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా శుక్రవారం రూ. 1.5 కోట్లను.. భారతీరాజా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఎఫ్ఆఎఫ్ఎస్ఐ ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి, తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధిపతి కలైపులి ఎస్ థానులకు సూర్య తండ్రి శివకుమార్ అందజేశారు. అందులో సౌత్ సినీకార్మికుల సమాఖ్యకు కోటి రూపాయలు, తమిళ చిత్ర నిర్మాతల మండలికి రూ.30 లక్షలు, నడిగర్ సంఘానికి రూ.20 లక్షలు చెక్‌లను అందజేశారు. (ఖేల్‌రత్న అందుకోవాల్సిన వినేశ్ ఫొగాట్‌కు కరోనా పాజిటివ్)
Out of the promised 5 CR, #Suriya sir has donated 1.5 CR to various film industry bodies- FEFSI (80 lakhs), Tamil Film Producers Council (30 lakhs), Directors Union (20 lakhs) & Nadigar Sangam (20 lakhs)
Bharathiraja sir & Sivakumar sir did the honors@rajsekarpandian @onlynikil pic.twitter.com/BaMmpASLmT
— Kaushik LM (@LMKMovieManiac) August 28, 2020
‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకు సుధా కొంగర దర్శకురాలు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్ గోపీనాథ్ బయోపిక్ ఈ చిత్రం రూపొందింది. ఏప్రిల్ 9నే మూవీ విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. సుదీర్ఘ చర్చల అనంతరం అక్టోబరు 30న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే సూర్య ప్రకటించారు.
Also Read :