నేడు, రేపు ఏపీలో మోస్తరు వర్షాలు

ఉభ‌య రాష్ట్రాల‌కు అల్ప పీడ‌నాల టెన్ష‌న్ ఎక్క‌వ‌వుతోంది. ఇప్ప‌టికే వ‌రుస‌ అప్ప‌పీడ‌నాల ప్ర‌భావంతో, భారీ వ‌ర్షాలు కురిసి వ‌ర‌ద‌లు పోటెత్తిన విష‌యం తెలిసిందే.

నేడు, రేపు ఏపీలో మోస్తరు వర్షాలు
Follow us

|

Updated on: Aug 29, 2020 | 7:39 AM

ఉభ‌య రాష్ట్రాల‌కు అల్ప పీడ‌నాల టెన్ష‌న్ ఎక్క‌వ‌వుతోంది. ఇప్ప‌టికే వ‌రుస‌ అప్ప‌పీడ‌నాల ప్ర‌భావంతో, భారీ వ‌ర్షాలు కురిసి వ‌ర‌ద‌లు పోటెత్తిన విష‌యం తెలిసిందే. తాజాగా ఉత్తర చ‌త్తీస్‌గ‌ఢ్, దాని ప‌క్క‌నే ఉన్న‌ తూర్పు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ప్రాంతాల్లో ఏర్ప‌డిన తీవ్ర అల్ప‌పీడ‌నం కొన‌సాగుతోంది. దీనికి తోడు అనుబంధంగా 7.6 కిలోమీట‌ర్ల ఎత్తువ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవర్త‌నం కొన‌సాగుతోంది. ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమోరిన్ ఏరియా వరకు 0.9 కిలోమీట‌ర్ల‌ ఎత్తు వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది.

రుతుపవనాల ప్రభావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పలు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

Also Read :

ఏపీఐసీడీఏ ఏర్పాటు, ఛైర్మన్​గా సీఎం జగన్​

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు