Thalaivar 170 Title Teaser : వేటయన్‌గా సూపర్ స్టార్.. మరోసారి పోలీస్ గెటప్‌లో రజినీకాంత్
రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణిస్తున్నారు. ఎంతమంది కొత్త హీరోలు వచ్చిన సూపర్ స్టార్ ను మ్యాచ్ చేసే హీరో మాత్రం ఇప్పటివరకు రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. రజనీకాంత్ తమిళంలోనే కాకుండా కన్నడ, హిందీ వంటి భాషల్లో కూడా చిత్రీకరించారు. సూపర్ స్టార్ సినిమాలకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో డబ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

సూపర్ రజినీకాంత్ పుట్టిన రోజు నేడు. ఆయన నేడు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణిస్తున్నారు. ఎంతమంది కొత్త హీరోలు వచ్చిన సూపర్ స్టార్ ను మ్యాచ్ చేసే హీరో మాత్రం ఇప్పటివరకు రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. రజనీకాంత్ తమిళంలోనే కాకుండా కన్నడ, హిందీ వంటి భాషల్లో కూడా చిత్రీకరించారు. సూపర్ స్టార్ సినిమాలకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో డబ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవలే జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు సూపర్ స్టార్.
జైలర్ సినిమా కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు కలెక్షన్స్ పరంగాను రికార్డ్ క్రియేట్ చేసింది. 700 కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమా. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు సూపర్ స్టార్.
జైలర్ సినిమా తర్వాత రజినీకాంత్ స్పీడ్ పెంచారు. ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్ సలాం అనే సినిమాలో నటించారు రజిని. అలాగే ఇప్పుడు టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా తలైవా 170 మూవీ టైటిల్ ను విడుదల చేశారు. ఈ మేరకు ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వేటయన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.