ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) దండయాత్ర కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటవ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా ఇప్పటివరకు రూ. 150 కోట్ల గ్రాస్ సాధించి సరికొక్త రికార్డ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 12న విడుదలైన సంచలన విజయం సాధించింది. తాజాగా సినిమా మరో సరికొత్త రికార్డ్ అందుకుంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల షేర్ సాధించింది.
పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నైజాంలోనే 30 కోట్ల షేర్ మార్క్‌ను దాటింది. ఈ చిత్రం నైజాంలో ఐదవ రోజు 1.86 కోట్ల షేర్ సాధించింది. నైజాం ఏరియాలో 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన మహేష్ బాబు మూడవ చిత్రం సర్కారు వారి పాట. విడుదల తర్వాత యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా స్ట్రాంగ్ బిజినెస్ ని కొనసాగిస్తోంది. సర్కారు వారి పాట వేసవి సెలవులను క్యాష్ చేస్తుంది.
నైజాం.. 31.47 కోట్లు.
సీడెడ్.. 10.44 కోట్లు.
యూఏ..రూ.10.25 కోట్లు.
గుంటూరు. రూ.7.85కోట్లు.
ఈస్ట్ గోదావరి.. రూ.7.5కోట్లు.
కృష్ణ.. 5.76 కోట్లు.
వెస్ట్.. రూ. 4.65కోట్లు.
నెల్లూరు. 3.12 కోట్లు.
అలాగే తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.59 కోట్లు.
ఓవర్సీస్ రూ. 12.1 కోట్లు.
మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 100.44 కోట్లు సాధించింది. అలాగే రూ. 160 .20 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.