AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైలర్ 2 నుంచి క్రేజీ అప్డేట్.. మరింత యాక్షన్‌తో సినిమా.. షూటింగ్ ఎప్పటినుంచంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో రజినీకాంత్ అంత పెద్ద హిట్ అందుకోలేకాదు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించారు

జైలర్ 2 నుంచి క్రేజీ అప్డేట్.. మరింత యాక్షన్‌తో సినిమా..  షూటింగ్ ఎప్పటినుంచంటే..
Jailer 2
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2025 | 3:52 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఊహించని విధంగా ఈ సినిమా ఏకంగా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రజినీకాంత్ తనదైన స్టైల్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జైలర్ సినిమాలో సూపర్ స్టార్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు. స్క్రీన్ ప్లే పరంగానూ, కలెక్షన్ల పరంగానూ జనాల ఆదరణ పొందింది జైలర్ సినిమా. అలాగే జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు.

జైలర్ భారీ విజయం సాధించిన తర్వాత జైలర్ 2 సినిమా కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. మొన్నామధ్య జైలర్ 2 సినిమా టీజర్ ను విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జైలర్ 2 టీజర్ ను విడుదల చేశారు. జైలర్ 1లో రజనీకాంత్‌తో కలిసి రమ్యకృష్ణ, వినాయకన్, తమన్నా భాటియా, వసంత్ రవి, మీర్నా మీనన్, యోగి బాబు నటించారు. ఇదే టీమ్ ఇప్పుడు జైలర్ 2లోనూ కనిపించనున్నారు. ఈ సినిమాను కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా  తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్.

జైలర్ టీజర్ 2 ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ టీజర్‌కి జనాల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ టీజర్‌లో మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కనిపించడం గమనార్హం. ఇక ఈ సినిమాలో మరింత వైలెన్స్ ఉండనుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమా షూటింగ్ మార్చి 10, 2025న చెన్నైలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో చెన్నైలో ప్రారంభమవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us