Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ ఖాతాలో సరికొత్త రికార్డు.. కళావతి పాటకు భారీ రెస్పాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.. ఈ సినిమాకోసం మహేష్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ ఖాతాలో సరికొత్త రికార్డు.. కళావతి పాటకు భారీ రెస్పాన్స్..
Mahesh Babu Sarkaru Vaari P
Follow us

|

Updated on: Mar 09, 2022 | 6:40 AM

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.. ఈ సినిమాకోసం మహేష్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మొదటిసారి కీర్తి సురేష్ మహేష్ మాతో జతకడుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. ఇటీవల మహేష్ బాబు మోకాలి సర్జరీ జరగడం.. ఆ తర్వాత.. మహేష్.. కీర్తి సురేష్ కరోనా బారిన పడడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.. అయితే రీసెంట్ గా ఈ మూవీనుంచి కళావతి సాంగ్ ను విడుదల చేశారుచిత్రయూనిట్ ఈ పాట చాట్ బస్టర్ గా నిలిచింది. తమన్ సంగీతం అదించిన ఈపాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మహేష్ బాబు ఇమేజ్ కు మరియు ఆయన అభిమానులకు తగ్గట్లుగా కళావతి సాంగ్ ఉంది. తాజాగా ఈ పాట మహేష్ ఖాతాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కళావతి డాన్స్ ఛాలెంజ్ ను మహేష్ కూతురు సితార ఇన్ స్టా లో షేర్ చేయడం తో అనూహ్యంగా ఈపాటకు మంచి క్రేజ్ వచ్చింది అయ్యింది. సితార ఛాలెంజ్ ను స్వీకరించిన పలువురు సినిమా తారలు ఈ పాట హుక్ స్టెప్ ను చేసి వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పాటకు తెలుగు ఇండస్ట్రీలో అత్యంత స్పీడ్ గా మిలియన్ లైక్స్ దక్కాయి. ఇప్పటికే ఈపాట 70 మిలియన్ వ్యూస్ తో  దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాను మే 12వ తారీకున భారీ ఎత్తున విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సరసన ఆ ముద్దుగుమ్మ.. బాబీ.. చిరు సినిమాలో హీరోయిన్ ఎవరంటే..

Priyanka Jawalkar: కుర్రాళ్లను ఫిదా చేస్తున్న ముద్దుగుమ్మ.. ప్రియాంక కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. (ఫొటోస్)

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..