
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్, ఒడిశాలో జరుగుతుంది. ఇక త్వరలోనే మరో షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ మూవీ చిత్రీకరణ మాత్రం శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ కోసం మహేష్ న్యూ లుక్స్ ట్రై చేస్తున్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మహేష్ బాబుకు సంబంధించి ఫోటో, వీడియో లీక్ అయిన వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి ఇటలీకి వెకేషన్ వెళ్లాడు మహేష్. ఇందుకు సంబంధించి ఏ ఫోటో బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా ఒక వ్యక్తితో ఏదో డిస్కషన్ చేస్తున్నారు మహేష్. అందులో గుబురు గడ్డంతోపాటు పొడవైన జుట్టుతో ఊహించని లుక్ లో కనిపించాడు మహేష్. రాజమౌళి సినిమాలో మహేష్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడని ఈ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటిగా ఉన్నారు. ఆఫ్రికన్ అడవుల అడ్వైంచర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇందులో మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం కీలకపాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.
ప్రస్తుతం SSMB 29 విషయంలో డైరెక్టర్ రాజమౌళి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని నటీనటులకు సంబంధించిన లుక్స్, పాత్రలు, షూటింగ్స్ లీక్స్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
Mahesh Babu News
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..