AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu Birthday: మహేష్ రేంజ్ మాములుగా లేదుగా..! సూపర్ స్టార్ ఆస్తి ఎన్ని కోట్లంటే

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశాడు. 1979లో వచ్చిన ‘నీడ’ సినిమాలో మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. 1999లో విడుదలైన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

Mahesh Babu Birthday: మహేష్ రేంజ్ మాములుగా లేదుగా..! సూపర్ స్టార్ ఆస్తి ఎన్ని కోట్లంటే
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2024 | 9:35 AM

Share

ఈరోజు (ఆగస్టు 9) టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. టాలీవుడ్‌లో ప్రిన్స్‌గా పేరు తెచ్చుకున్నాడు మహేష్ . సినిమా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్‌గా పేరుతెచ్చుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశాడు. 1979లో వచ్చిన ‘నీడ’ సినిమాలో మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. 1999లో విడుదలైన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. మహేష్ బాబు ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు.

మహేష్ బాబు ఆస్తుల విలువ దాదాపు రూ. 330 కోట్ల రూపాయలు. టాలీవుడ్‌లోని అత్యంత ధనవంతులైన హీరోల్లో ఆయన ఒకరు. ఒక్కో సినిమాకు రూ.50-80 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు మహేష్. అలాగే మహేష్‌కు ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అలాగే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రూ. 125 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది.

మహేష్ బాబు మొదటి సినిమాకి కేవలం 75 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. ఇప్పుడు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకున్నాడు. ‘శ్రీమంతుడు’, ‘భరత అనే నేను’, ‘సర్కారు వారి పాట’ సినిమాలు ఇటీవల విడుదలై విజయం సాధించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ చిత్రానికి 78 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మహేష్ బాబుకు 30 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. మహేష్ 2005లో నటి, వ్యాపారవేత్త నమ్రతా శిరోద్కర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సితార, గౌతమ్ అనే పిల్లలు ఉన్నారు. ఇక మహేష్ బాబు దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు. రాజమౌళి, మహేష్ బాబుల సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రకరకాల పోస్ట్ లు, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us