Sunny Leone: బోల్డ్ మూవీతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న సన్నీలియోన్.. రిలీజ్ ఎప్పుడంటే..
ఇందులో సారా, ప్రియమణి, సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కీలకపాత్రలో సన్నీ లియోన్ కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కనిపించబోతున్నాడు. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్యూజీ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీంట్రీ ఇవ్వబోతుంది. రెండేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ బ్యూటీ. బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్యూజీ (కొటేషన్ గ్యాంగ్) టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సారా, ప్రియమణి, సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కీలకపాత్రలో సన్నీ లియోన్ కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కనిపించబోతున్నాడు. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్యూజీ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అలాగే కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. క్రైమ్ సిండికేట్ గ్యాంగ్ గా ఏర్పడిన కొంతమంది మహిళలు ఎలా హత్యలకు పాల్పడ్డారు ? వారంతా కిల్లర్ గా మారడానికి కారణాలు ఏమిటి ? తమకు అడ్డొచ్చిన వారిని కిరాతంగా ఎలా చంపారు అనే విషయాలను బోల్డ్, క్రైమ్ అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.
ఈ మూవీలో జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని హిందీతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి డ్రమ్స్ శివమణి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను మొత్తం ఐదు భాషలలో రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు మేకర్స్. సన్ని లియోన్ తెలుగులో మంచు మనోజ్ కరెంట్ తీగలో గెస్ట్ రోల్ చేసింది. మంచు విష్ణు జిన్నా నెగిటివ్ షేడ్స్ తో కూడిన క్యారెక్టర్ లో కనిపించింది. అలాగే గరుడవేగతోపాటు మరికొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. బాలీవుడ్ లో బోల్డ్ రోల్స్ పాపులర్ అయిన సన్నీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు క్యూజీ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




