AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Leone New Movie: భయపెట్టడానికి సిద్ధమవతోన్న సన్నీ లియోన్‌.. ఆసక్తికరంగా కొత్త సినిమా మోషన్‌ పోస్టర్‌..

Sunny Leone New Movie: 2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా వెండి తెరకు పరిచయమైంది అందాల తార సన్నీ లియోన్‌. ఈ షో ద్వారా భారతీయ సినీ ప్రేక్షకులను పలకరించిన సన్నీ త్వరలోనే..

Sunny Leone New Movie: భయపెట్టడానికి సిద్ధమవతోన్న సన్నీ లియోన్‌.. ఆసక్తికరంగా కొత్త సినిమా మోషన్‌ పోస్టర్‌..
Sunny Leone New Movie
Narender Vaitla
|

Updated on: Mar 27, 2021 | 1:18 PM

Share

Sunny Leone New Movie: 2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా వెండి తెరకు పరిచయమైంది అందాల తార సన్నీ లియోన్‌. ఈ షో ద్వారా భారతీయ సినీ ప్రేక్షకులను పలకరించిన సన్నీ త్వరలోనే బాలీవుడ్‌లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఏడాది తర్వాతే 2012లో ‘జిస్మ్‌2’లో నటించే అవకాశాన్ని కొట్టేసిందీ బ్యూటీ. తొలి సినిమాతోనే దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న సన్నీలియోన్‌.. కేవలం తన అందంతోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంది. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన బ్యూటీ ఉత్తరాదికే పరిమితం కాకుండా దక్షిణాదిలోనూ తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే తొలిసారి తెలుగులో కరెంట్‌ తీగ చిత్రంలో స్పెషల్‌ రోల్‌లో కనిపించింది. ఇక తర్వాత భాషతో సంబంధం లేకుండా తమిళం, హిందీ, మలయాళం, తెలుగు సినిమాల్లో అడపాదడపా కనిపిస్తోందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా సన్నీలియోన్‌ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. మలయాళంలో తెరకెక్కుతోన్న లేడి ఓరియెంటెడ్‌ చిత్రంలో నటించనుంది సన్నీ. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో సన్నీ లియోన్‌ ఓ పిల్లాడిని కాపాడే యువతి పాత్రలో నటిస్తోంది. ఇప్పటి వరకు తన అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది తొలిసారి భయపెట్టించనుందన్నమాట. ఈ చిత్రానికి శ్రీజిత్‌ విజయన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీతో పాటు మలయాళంలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సన్నీలియోన్‌ అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలపడం విశేషం. ‘షీరో’ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసిన సన్నీ.. ‘సైకలాజిలక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ‘షీరో’ చిత్రంలో నటిస్తున్నందుకు ఎంతో ఆతృతతో ఉన్నాను’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. మరి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోన్న సన్నీకి ఈ చిత్రం ఎలాంటి ఇమేజ్‌ను సంపాదించి పెడుతుందో చూడాలి.

సన్నీ లియోన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌..

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

ఇవీ కూడా చూడండి: WORLD THEATRE DAY 2021 : నాటక రంగాన్ని ఆదరించి.. అభివృద్ధి చేయాలి.. సందేశమిచ్చిన నటి హెలెన్ మిర్రెన్

Paresh Rawal: కరోనా బారిన పడిన మరో నటుడు.. టీకా వేసుకున్నా ఫలితం లేదు.. పాజిటివ్ గా నిర్ధారణ

చరణ్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు డబుల్ సర్‌‌‌‌‌‌‌ప్రైజ్ ఇచ్చిన ‘ఆచార్య’ టీమ్.. ఆకట్టుకుంటున్న మెగాపవర్ స్టార్ లుక్