WORLD THEATRE DAY 2021 : నాటక రంగాన్ని ఆదరించి.. అభివృద్ధి చేయాలి.. సందేశమిచ్చిన నటి హెలెన్ మిర్రెన్
WORLD THEATRE DAY 2021 : మార్చి27న ప్రపంచ థియేటర్ డే జరుపుకుంటారు. పౌరుల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి
WORLD THEATRE DAY 2021 : మార్చి27న ప్రపంచ థియేటర్ డే జరుపుకుంటారు. పౌరుల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రపంచ థియేటర్ డే ఏర్పాటు చేశారు. ఈ రోజున థియేటర్ ఔత్సాహికులు అందరు కలిసి సంబరాలు చేసుకుంటారు. అవార్డు కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఛారిటీ నాటకాలు, థియేటర్ వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని 1962 నుంచి అంతర్జాతీయ థియేటర్ ఇన్స్టిట్యూట్ సెంటర్లు, ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ కోఆపరేటింగ్ సభ్యులు, థియేటర్ నిపుణులు, థియేటర్ సంస్థలు, థియేటర్ విశ్వవిద్యాలయాలు, థియేటర్ ప్రేమికులు నిర్వహించుకుంటున్నారు.
ప్రపంచ థియేటర్ డే 2021 సందేశాన్ని స్టేజ్, స్క్రీన్ మరియు టీవీ నటి హెలెన్ మిర్రెన్ రాశారు. ది క్వీన్ చిత్రంలో ఆమె నటనకు ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుతో సహా పలు అవార్డులను గెలుచుకుంది. లైవ్ పెర్ఫార్మెన్స్‌లో చురుకుగా పాల్గొన్న కళాకారులకు గత సంవత్సరం ప్రత్యేకంగా ఎలా గడిచిందో తన సందేశంలో మిర్రెన్ తెలియజేశారు. తన సందేశానికి మరింత ఆశాజనక విధానాన్ని ఇస్తూ.. ప్రపంచ మహమ్మారి కరోనా నుంచి కళాకారులు ఎలా బయటపడ్డారో వివరించారు. అంతేకాకుండా తమ వినోదాన్ని ప్రేక్షకులకు ఏ విధంగా తెలియజేశారో తెలిపారు. ఈ కాలంలో ఇంటర్నెట్ ఎలాంటి పాత్ర పోషించిందో ఆమె వివరించారు. రచయితలు, డిజైనర్లు, నృత్యకారులు, గాయకులు, నటులు, సంగీతకారులు, దర్శకుల సృజనాత్మక చిరకాలం నిలిచి ఉంటుందని సందేశం ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న కొత్త రూపాలకు తగినట్లుగా మార్చుకుంటూ వినోదాన్ని అందిస్తామని ప్రకటించారు.
ఏ కళా రూపమైనా ఆలోచనతో మొదలయి సృజనాత్మకతతో ముగియాలి. అప్పుడే ఆ కళ.. దేశ భాషలు, సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా నిలుస్తుంది. అంతర్జాతీయ సమస్యలను ప్రపంచదేశాలకు ఏకీకృతంగా చూపించగలుగుతుంది. మూస పద్ధతిలో ప్రదర్శిస్తున్న నాటకాల పోకడలకు కొత్త బీజం వేస్తూ రచయితలు సామాజిక సమస్యల్ని రాజకీయ సమస్యలను , సార్వజనీనకంగా ఉన్న రచనల్లో సమగ్రంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నాటకాలను దర్శించడానికి ప్రయోక్తలు, టెక్నీషియన్స్ ఎన్నో అధ్యయనాలు చేసి సంగీతంలోనూ, లైటింగ్ లోనూ పాత్రల ఫ్రీజింగ్ లాంటివి సాంకేతికంగా చొప్పించి, వాస్తవికంగా చూపించి ప్రదర్శించడానికి కృషి చేస్తున్నారు. వారందరి కోసం నాటకరంగాన్ని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.