AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa : పుష్ప కోసం రంగంలోకి సన్నీలియోన్.. రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

బన్నీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. మునుపెన్నడూ చేయని వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు అల్లు అర్జున్.

Pushpa : పుష్ప కోసం రంగంలోకి సన్నీలియోన్.. రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
Sunny Leone
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2021 | 9:21 PM

Share

Pushpa : బన్నీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. మునుపెన్నడూ చేయని వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటిస్తోంది. ప్రతినాయకుడిగా ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో బన్నీ పూర్తిగా డీగ్లామర్‏ రోల్‏లో కనిపించబోతుండడంతో.. పుష్ప కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పుష్పరాజ్ ఎంట్రీ వీడియో సంచలనం సృష్టించాయి. ఈ సినిమాలో అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఉండనుందని తెలుస్తుంది. సుకుమార్ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా దేవీశ్రీ సంగీతం. ఇక మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం. అయితే ఈ సినిమా ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీతోపాటు చాలా మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలను సంప్రదించారంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా కోసం సన్నీలియోన్ ను దించుతున్నారన్న వార్త హల్‌‌‌‌చల్ చేస్తోంది. ఇందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని అంటున్నారు. గతంలో రాజశేఖర్ నటించిన గరుడ వేగా సినిమాలో ఐటమ్  సాంగ్ చేసింది సన్నీ. ఇక సన్నీలియోన్ పారితోషికంతో పాటు సెట్ మరియు ఇతర డాన్సర్ ఖర్చు కలిపి కోటికి మించి ఖర్చు అవుతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సక్సెస్‌‌‌‌ఫుల్ డైరెక్టర్ చేతులమీదుగా క్రేజీ అంకుల్స్ లిరికల్‌‌‌ సాంగ్.. హీరోయిన్‌‌‌‌గా శ్రీముఖి

Ram Gopal Varma: మరో వివాదాస్పద వెబ్ సిరీస్‌‌‌‌తో రానున్న వర్మ.. ఈ సారి ‘రకరకాల భార్యలు’అంటూ..

Nidhhi Agerwal: వాన పాటలు చూడటాన్నికి బాగుంటాయి..కానీ చేయడానికే చిరాకు అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి