Sunil: సునీల్‌ను ఇంక కమెడియన్‌గా చూడలేమా..? భీమవరం బుల్లోడు ఇకపై నవ్వించడా..?

తెలుగులో మాత్రమే కాదు.. అన్ని భాషల్లోనూ బిజీ అవుతున్నారు సునీల్. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ జైలర్, శివకార్తికేయన్ మావీరన్ సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నారు.

Sunil: సునీల్‌ను ఇంక కమెడియన్‌గా చూడలేమా..?  భీమవరం బుల్లోడు ఇకపై నవ్వించడా..?
Actor Sunil
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 19, 2023 | 5:24 PM

సునీల్‌ను ఇంక కమెడియన్‌గా చూడలేమా..? అతడి కామెడీని అభిమానించే సగటు సినీ ప్రేక్షకుడి మనసులో ఉన్న రెగ్యులర్ డౌట్ ఇది. కొన్నేళ్ళుగా సునీల్ ఎంచుకుంటున్న కథలు విభిన్నంగా ఉంటున్నాయి. మరి ఇకపై ఈ భీమవరం బుల్లోడు స్క్రీన్ మీద నవ్వించడా..? పైగా తెలుగుతో పాటు మిగిలిన ఇండస్ట్రీలపై ఫోకస్ చేసారు సునీల్. మరి ఈయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? అన్న డౌట్స్ వస్తున్నాయి.  సునీల్.. అనే పేరు వినగానే పెదవులపై తెలియకుండానే ఓ చిరునవ్వు వచ్చేస్తుంది. ఇండస్ట్రీపై ఈయన వేసిన ముద్ర అలాంటిది మరి. ఒకటి రెండు కాదు.. వందల సినిమాల్లో తనదైన నటనతో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించారు సునీల్. కానీ ఇప్పుడీయన తీరు మారింది.. ఎంచుకునే కథల శైలి మారింది.. పుష్పతో పాన్ ఇండియన్ నటుడు కావడంతో అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి.

హీరోగా విజయాలు రాకపోవడంతో.. కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్‌కు డిస్కో రాజాలో తొలిసారి విలన్‌గా నటించే అవకాశం వచ్చింది. దాంతో పాటు కలర్ ఫోటోలోనూ అదిరిపోయే విలనిజం చూపించారు సునీల్. ఇక పుష్పలో మంగళం శ్రీను పాత్రతో సునీల్ రేంజ్ పెరిగిపోయింది. దాంతో ఇక కామెడీ పాత్రలకు సెలవిచ్చి.. విలన్ వైపు అడుగులు వేస్తున్నారు ఈ భీమవరం బుల్లోడు.

తెలుగులో మాత్రమే కాదు.. అన్ని భాషల్లోనూ బిజీ అవుతున్నారు సునీల్. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ జైలర్, శివకార్తికేయన్ మావీరన్ సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా జైలర్‌లో సునీల్ లుక్ బయటికి వచ్చింది. శంకర్, రామ్ చరణ్ సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. విలన్ రోల్స్ చేస్తున్నా.. కథ బాగుంటే కామెడీ చేయడానికి కూడా రెడీ అంటున్నారు ఈయన. ఏదేమైనా ఒకప్పట్లా సునీల్‌ను కమెడియన్‌గా చూడటం ఇక కష్టమే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి