AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadivelu Mother Sarojini: హాస్యనటుడు వడివేలు ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో తల్లి మృతి..

తన తల్లి సరోజిని గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేక మదురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బుధవారం ఆమె చికిత్సకు స్పందించకుండా మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం సరోజినికి అంత్యక్రియలు నిర్వహించారు. 

Vadivelu Mother Sarojini: హాస్యనటుడు వడివేలు ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో తల్లి మృతి..
Vadivelu Mother Sarojini
Surya Kala
|

Updated on: Jan 19, 2023 | 6:01 PM

Share

ప్రముఖ కోలీవుడ్ సీనియర్‌ కమెడియన్‌ వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా వృద్ధాప్యపు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వడివేలు తల్లి సరోజిని అమ్మాళ్ (ఎ) పాప (87) మరణించారు. సరోజిని అమ్మాళ్ మధురై సమీపంలోని తన స్వగ్రామం విరగానూర్‌ లో నివసిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సరోజినీ గత కొంతకాలంగా మధురైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తల్లి మరణించే సమయంలో వడివేలు మూవీ షూటింగ్ లో ఉన్నారు వడివేలు. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వడివేలు మాట్లాడుతూ.. తన తల్లి సరోజిని గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేక మదురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బుధవారం ఆమె చికిత్సకు స్పందించకుండా మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం సరోజినికి అంత్యక్రియలు నిర్వహించారు.

వడివేలు తల్లి సరోజిని మృతి పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్‌ సంతాపం ప్రకటించారు. సరోజినీ మరణవార్త విని చాలా బాధపడ్డానని.. తల్లి మరణం ఏ కుమారునికైనా తీరని లోటు అని స్టాలిన్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. పుయల్’ వడివేలు , అతని కుటుంబ సభ్యులకు  పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు.

వడివేలు కోలీవుడ్ నటుడు అయినప్పటికీ డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది.  దక్షిణాదిలో ఫేమస్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వడివేలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. పలు కారణాలతో కోలీవుడ్ కొంతకాలం నిషేధం విధించింది. ఇటీవల మళ్ళీ వెండి తెరపై రీఎంట్రీ ఇచ్చారు వడివేలు. గతేడాది నాయి శేఖర్‌ సినిమాతో మళ్ళీ  ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం చంద్రముఖి 2 మూవీలో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..