Sundeep Kishan: నవ్వులతో రాబోతున్న ‘గల్లీ రౌడీ’.. సందీప్ కిషన్ సినిమా వచ్చేది అప్పుడే..
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసే ఈ కుర్రహీరో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.

Sundeep Kishan: యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసే ఈ కుర్రహీరో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ మూవీలో లావణ్యత్రిపాఠి హీరోయిన్ గా నటించింది.
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత సందీప్ కిషన్ నటిస్తున్న సినిమా గల్లీ రౌడీ. ముందుగా ఈ సినిమాకు రౌడీ బేబీ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా టైటిల్ లో మార్పు చేయాల్సి వచ్చింది. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బాబి సింహా.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ తోనే తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్ తెరకెక్కించిన డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కార్తీక్- చౌరాస్త రామ్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మే 21న ఈ సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Vakeel Saab pre release event Highlights: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తిన శిల్పకళావేదిక