AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigali Sudheer: రష్మీతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుధీర్.. ఇద్దరి కాంబోలో సినిమా ?..

ఇప్పుడు కాలింగ్ సహస్ర సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నాడు సుధీర్. ఈ చిత్రానికి అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహించారు. ఇందులో డాలీషా, స్పందన పిల్లై హీరోయిన్లుగా నటించారు. శివ బాలాజీ కీలకపాత్ర పోషించారు. మోహిత్ రెహ్మానియాక్ సంగీతం అందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ క్రమంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు మేకర్స్.

Sudigali Sudheer: రష్మీతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుధీర్.. ఇద్దరి కాంబోలో సినిమా ?..
Sudheer Rashmi
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2023 | 7:54 AM

Share

తెలుగు ప్రజలకు పరిచయం అవసరంలేని పేరు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై పాపులర్ అయ్యాడు సుధీర్. అతడి కామెడీ టైమింగ్, స్టైల్ కు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. తన కామెడీతో ఓ గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ .. ఇప్పుడు హీరోగా వెండితెరపై అలరిస్తున్నారు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన సుధీర్.. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు కాలింగ్ సహస్ర సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నాడు సుధీర్. ఈ చిత్రానికి అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహించారు. ఇందులో డాలీషా, స్పందన పిల్లై హీరోయిన్లుగా నటించారు. శివ బాలాజీ కీలకపాత్ర పోషించారు. మోహిత్ రెహ్మానియాక్ సంగీతం అందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ క్రమంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు మేకర్స్.

నిన్న సాయంత్రం కాలింగ్ సహస్ర సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన చిత్రయూనిట్.. అనంతరం విలేకరులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు సుధీర్. ఈ క్రమంలోనే ఓ విలేకరి మాట్లాడుతూ.. మీ పెళ్లేప్పుడు.. రష్మీని చేసుకుంటారా ?.. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా ? అని అడిగాడు.. ఇక దీనికి సుధీర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ ప్రశ్న తనకు ప్రతిచోట అడుగుతూనే ఉంటారని.. జనాలు మా ఇద్దరి అంతగా ఓన్ చేసుకున్నారని అన్నారు. రష్మీతో కెమిస్ట్రీ అనేది కేవలం ఆన్ స్క్రీన్ కోసం చేసిందే అని.. పెళ్లి అనేది తన చేతుల్లో లేదని అన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ కెరీర్, సినిమాలపైనే ఉందని.. పెళ్లి గురించి ఆలోచనే లేదని.. ఒకవేళ దేవుడు అటు తిప్పితే చేసుకుంటానేమో అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్.

ఇక ఆ తర్వాత రష్మితో సినిమా చేస్తున్నారా ?.. అని అడగ్గా.. ‘ఇద్దరం కథలు వింటున్నాం. మా ఇద్దరికీ కామన్ గా నచ్చిన కథ ఇప్పటివరకు దొరకలేదు. ఒకవేళ అలాంటిది దొరికితే కచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తాం. ఆ ప్రపోజల్ అయితే ఉంది’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.