AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harom Hara: ‘హరోం హర’ బంపరాఫర్.. ఒక్క మిస్డ్ కాల్‌తో ఐ ఫోన్, జీప్, బైక్‌ను సొంతం చేసుకునే ఛాన్స్

సుధీర్‌బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘హరోం హర’. జ్ఞాన సాగర్ తెరకెక్కించిన ఈ సినిమాలో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించింది. సుమంత్ జి. నాయుడు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది.

Harom Hara: 'హరోం హర' బంపరాఫర్.. ఒక్క మిస్డ్ కాల్‌తో ఐ ఫోన్, జీప్, బైక్‌ను సొంతం చేసుకునే ఛాన్స్
Sudheer Babu's Harom Hara movie
Basha Shek
|

Updated on: May 29, 2024 | 7:48 PM

Share

సుధీర్‌బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘హరోం హర’. జ్ఞాన సాగర్ తెరకెక్కించిన ఈ సినిమాలో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించింది. సుమంత్ జి. నాయుడు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అనివార్య కారణాలతో హరోం హర సినిమా రిలీజ్ వాయిదా పడింది. జూన్ 14న సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే సినిమా ఆడియెన్స్ కోసం ఒక అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించారు మేకర్స్. తమ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక వినూత్నమైన కాంటెస్ట్ కు ప్లాన్ చేశారు. దీని ప్రకారం ఈ పోటీలో పాల్గొనే వారు 08045936069 టోల్ ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ కాల్ ఇస్తే చాలు. దీంతో వారి వద్ద మీ ఫోన్ నంబర్ ఆటో మేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఇలా వచ్చిన వారందరిలో నుంచి కొందరిని లాటరీ పద్ధతిలో విజేతలుగా ఎంపికచేస్తారు. ఈ కాంటెస్ట్ లో గెలుపొందిన వారు ఏకంగా జీప్, ఐపోన్ 16 PRO, చేతక్ బైక్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

హరోం హరా చిత్ర బృందం షేర్ చేసి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ ఇప్పటికే భారీగా మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. మహేశ్ బాబు, సుధీర్ అభిమానులు కూడా ఈ పోస్ట్ ను భారీగా షేర్ చేస్తున్నారు. కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం (మే 30) టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా హరోం హర ట్రైల్ ను రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే తదితరులు నటించారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే టీజర్స్, పోస్టర్స్ తో ఆసక్తిని రేకెత్తించిన హరోం హర సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!