AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sodala Sridevi : భారీ ధరకు అమ్ముడుపోయిన సుధీర్ బాబు ‘సోడాల శ్రీదేవి’ థియేట్రికల్ రైట్స్

యంగ్ హీరో సుధీర్ బాబు సోడాల శ్రీదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమంగా ఉన్నాడు. పలస సినిమాతో విమర్శకుల..

Sodala Sridevi : భారీ ధరకు అమ్ముడుపోయిన సుధీర్ బాబు 'సోడాల శ్రీదేవి' థియేట్రికల్ రైట్స్
Rajeev Rayala
|

Updated on: Aug 15, 2021 | 12:23 PM

Share

Sodala Sridevi : యంగ్ హీరో సుధీర్ బాబు సోడాల శ్రీదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమంగా ఉన్నాడు. పలస సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న ఈ సినిమాని గ్రాండ్‌‌‌‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే సోడాల శ్రీదేవి ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో కూడా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం.

లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు.. సోడాల శ్రీదేవిగా ఆనంది కనిపించనున్నారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మందులోడా అనే మాస్ సాంగ్ అలాగే ఓ మెలోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా థియేట్రికల్ రైట్స్‌‌‌ను బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ 12 కోట్లకు ఈ హక్కులను సొంతం చేసుకున్నారు. సెకండ్ వేవ్ తర్వాత విడుదల అవుతున్న ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో పావెల్ నవగీతన్, నరేష్,సత్యం రాజేష్, రఘుబాబు, అజయ్, హర్షవర్ధన్, సప్తగిరి, రోహిణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi : మీ పోరాటాలకు,త్యాగాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.. మెగాస్టార్ ఎమోషన్ ట్వీట్

Partition On Film Screen: భారతీయ హృదయాలను తాకిన విభజనపై వచ్చిన ఐదు సినిమాలు.. అలనాటి మరుపురాని చిత్రాలు..

MAA Elections 2021: నటి హేమకు ఊరట.. హెచ్చరించి వదిలేసిన క్రమశిక్షణ కమిటీ.. మరోసారి రిపీట్ అయితే..