ధనుష్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తోన్న శేఖర్ కమ్ముల.. స్టోరీ లైన్ ఇదేనా..?

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jul 30, 2021 | 9:46 AM

చాలా మంది ఇతరభాష హీరోలు తెలుగులో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తమ సినిమాలను

ధనుష్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తోన్న శేఖర్ కమ్ముల.. స్టోరీ లైన్ ఇదేనా..?
Danush

Dhanush : చాలా మంది ఇతరభాష హీరోలు తెలుగులో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తమ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేసి మంచి మార్కెట్‌‌‌ను కూడా సంపాదించుకుంటున్నారు. తమిళ్ హీరోలు సూర్య, అజిత్, విజయ్, కార్తీ, విజయ్ ఆంటోని ఇలా చాలా మంది తమ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు డైరెక్ట్‌‌‌గా తెలుగు సినిమానే చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే హీరో ధనుష్ తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి సిద్దమయ్యారన్న విషయం తెలిసిందే. ధనుష్‌‌‌‌కు కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికే `రఘువరన్ బిటెక్`- `విఐపీ` సహా పలు డబ్బింగ్  చిత్రాల ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఇక టాలీవుడ్‌‌‌‌లో సెన్సిబుల్ డైరెక్టర్‌‌‌గా పేరుతెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టారు. తెలుగు- తమిళ్ నెటివిటీకి బాగా కనెక్టివిటీ ఉన్న స్క్రిప్ట్‌‌‌‌తో ధనుష్ -శేఖర్ కమ్ముల సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

రెండు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని టాక్ నడుస్తోంది. మన తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. అయితే పలు తిరుగుబాటుల కారణంగా రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా విడిపోయాయి. ఇప్పుడు ఇదే పాయింట్‌‌‌తో శేఖర్ కమ్ముల సినిమా రూపొందించనున్నారని తెలుస్తోంది. తమిళ్- తెలుగు ప్రజల భావోద్వేగాలన్నింటిని కలిపి తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడట శేఖర్ కమ్ముల. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మెగా ఆఫర్ కొట్టేసిన రష్మిక..!! చరణ్ -శంకర్ కాంబినేషన్‌‌‌‌లో రాబోతోన్న సినిమాలో హీరోయిన్ గా లక్కీ బ్యూటీ వీడీయో

Hero Arya: హీరో ఆర్యపై చీటింగ్ కేసు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని జర్మనీకి చెందిన మహిళ ఫిర్యాదు

Trivikram Srinivas: మాటలతో మాయ చేయాలన్నా.. సంచులకొద్దీ పంచులు వేయాలన్నా.. ఆయనకే చెల్లుతుంది..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu