Surya 44: ఇరగదీసిన సూర్య.. ఆకట్టుకుంటున్న రెట్రో మూవీ టైటిల్ టీజర్
టాలీవుడ్ లో సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు అదిరిపోయే మార్కెట్ కూడా ఉంది. ఇక ఇప్పుడు కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువ. సూర్య ఎన్నో డిఫరెంట్ మూవీస్ చేశాడు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశాడు సూర్య. అలాగే ఇప్పుడు కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. కంగువ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు దాటేసింది. దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కంగువ సినిమా సౌండింగ్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. సౌండ్ ఎక్కువగా ఉండటంతో సినిమా గందరగోళంగా ఉంది అని చాలా మంది విమర్శించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో కూడా ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. ఆ హీరోయిన్ ఈమేనా.. చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఇక ఇప్పుడు సూర్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య 44 చిత్రం టైటిల్ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సూర్య తన 44వ చిత్రం కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో కొన్ని నెలల క్రితమే విడుదలైంది. సూర్యను రెట్రో స్టైల్‌లో చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో సూర్య హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ఇది కూడా చదవండి : బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని ఆమె చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్
ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సంతోష్ నారాయణన్ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. క్రిస్మస్ సందర్భంగా ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి రెట్రో అనే టైటిల్ ఖరారు చేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి