Rajamouli-Mahesh: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో మహెష్ మూవీపై దృష్టి పెట్టిన జక్కన్న.. హాలీవుడ్ రేంజ్ లో సినిమా అంటూ టాక్..
ట్రిపుల్ ఆర్ సినిమాతో ఇండియన్ బాక్సఫీస్ ను షేక్ చేసిన జక్కన్న.. ఇదే సినిమా ఓటీటీ రిలీజ్‌తో...హాలీవుడ్ మేకర్స్ మనసు దోచారు. మార్వెల్ సినిమాలకు తీసిపోని విధంగా ట్రిపుల్ ఆర్ సినిమా ఉందని కొందరు హాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా చెప్పేలా చేశారు

Rajamouli-Mahesh Babu: గత కొంతకాలంగా తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా(Pan India) రేంజ్ లోనే తెరకెక్కతున్నాయి. త్రూ అవుట్ ఇండియా బాక్సాఫీస్ ను (Box Office) బద్దలు కొడుతున్నాయి. జక్కన్న క్రియేట్ చేసిన ఇదే పాత్ లో ఇప్పటికే చాలా మంది స్టార్ అండ్ నాన్ స్టార్ డైరెక్టర్స్ నడిచారు.. నడుస్తూనే ఉన్నారు. అయితే వీరందరికి కాస్త దూరంగా… ఢిఫరెంట్ గా పాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కు కొబ్బరి కాయ కొట్టనున్నారు పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న జక్కన్న. మహేష్ హీరోగా తాను తీయబోయే సినిమాను ఇంటర్నేషనల్ సినిమా.. హాలీవుడ్ కు గట్టి పోటీనిచ్చేలా తెరకెక్కిస్తున్నారు జక్కన్న.
ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో ఇండియన్ బాక్సఫీస్ ను షేక్ చేసిన జక్కన్న.. ఇదే సినిమా ఓటీటీ రిలీజ్‌తో…హాలీవుడ్ మేకర్స్ మనసు దోచారు. మార్వెల్ సినిమాలకు తీసిపోని విధంగా ట్రిపుల్ ఆర్ సినిమా ఉందని కొందరు హాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా చెప్పేలా చేశారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ అటాక్ అన్నట్టు… హాలీవుడ్ కు సినిమాకు డైరెక్ట్ పోటీనిచ్చేలా సినిమా తెరకెక్కించాలనకుంటున్నారు ఈ స్టార్ డైరెక్టర్.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో… అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో … మహేష్ బాబుతో తాను తీయబోయే సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో ప్రజెంట్ చేయనున్నారట జక్కన్న. అందుకోసం ఇప్పటికే కొందరు హాలీవుడ్ టెక్నీషియన్స్ అండ్ ఎక్స్ పర్ట్స్ తో మాట్లాడారట ఈ స్టార్ డైరెక్టర్ . అన్నీ అనకున్నట్టు జరిగితే.. ట్రిపుల్ ఆర్ ను మించి.. హై గ్రాఫికల్ అండ్ యాక్షన్ సీన్లతో.. మహేష్ సినిమాను తెరకెక్కించనున్నారట. దీంతో ఘట్టమనేని అభిమానులు జక్కన్న ఇచ్చే విజువల్ విందుకు రెడీ అవ్వండి..




