RRR Movie: ‘తారక్.. చిన్న కరెక్షన్’.. వైరలవుతున్న రాజమౌళి ట్వీట్.. అసలు ఏం జరిగిందంటే..
న్యూయార్క్ క్రిటిక్స్ ఇచ్చే అవార్డ్స్‌లలో బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు రాజమౌళి. అందుకోవడమే కాదు... ఈ అవార్డుతో.. తెలుగు వాన్ని ట్యాలెంట్ ఏంటో.. మరోసారి ప్రపంచానికి చూపించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాలర్ ఎగరేసేలా చేశారు.
దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భారతీయ సినీ ప్రియులే కాదు.. విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. ముఖ్యంగా జక్కన్న టేకింగ్ పై హాలీవుడ్ సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని వరించింది. అంతేకాదు న్యూయార్క్ క్రిటిక్స్ ఇచ్చే అవార్డ్స్‌లలో బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు రాజమౌళి. అందుకోవడమే కాదు… ఈ అవార్డుతో.. తెలుగు వాన్ని ట్యాలెంట్ ఏంటో.. మరోసారి ప్రపంచానికి చూపించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాలర్ ఎగరేసేలా చేశారు. దీంతో జక్కన్న అభినందనలు చెబుతూ.. సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం రాజమౌళికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
అభినందనలు జక్కన్న. మీ కీర్తి ప్రపంచవ్యాప్తం కావడానికి ఇది ఆరంభం మాత్రమే. ఇన్నేళ్ల మన జర్నీలో మీ గురించి నాకు తెలిసినదంతా ప్రపంచానికి కూడా తెలియాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ట్వీట్ చేశారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. హహ్హహ్హ.. తారక్ చిన్న కరెక్షన్.. ఇది మన ప్రయాణానికి ఆరంభం అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం జక్కన్న చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, ఒలివియా మోరీస్ కీలకపాత్రలలో నటించారు. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Haha. Small correction Tarak… Beginning of *OUR JOURNEY..:) https://t.co/ZFBQFmMlp8
— rajamouli ss (@ssrajamouli) December 3, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.