Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavya Maran: కుర్రాళ్ల హార్ట్ బ్రేక్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్‏తో కావ్య పాప డేటింగ్..

కావ్య మారన్.. కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటేచాలు ఆమె పేరు మారుమోగుతుంది. ఇక ఆమెకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లలో తన టీంను ఉత్సాహపరుస్తూ కనిపిస్తుంటుంది కావ్య. ప్రస్తుతం కావ్య మారన్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

Kavya Maran: కుర్రాళ్ల హార్ట్ బ్రేక్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్‏తో కావ్య పాప డేటింగ్..
Kavya Maran
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2025 | 6:04 PM

క్రికెట్ అభిమానులకు కావ్యా మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ సీజన్ లో ఆమె పేరు మారుమోగిపోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ అయిన కావ్యా.. ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరవుతూ తన టీంకు ఉత్సాహపరుస్తుంటుంది. ఈ క్రమంలోనే క్రికెట్ చూస్తూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్ సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తన టీం గెలిస్తే చిన్నపిల్లలా మారిపోయి సంతోషంతో గంతులేస్తుంటుంది. ఇక జట్టు ఓడిపోతే మాత్రం బోరున ఏడ్చేస్తుంది. అందుకే నెట్టింట కావ్య ఫోటోస్, వీడియోస్ వైరలవుతుంటాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల సమయంలో కావ్య సైతం స్టేడియంలో సందడి చేసింది. తాజాగా కావ్య పర్సనల్ లైఫ్ గురించి ఓ న్యూస్ ఇప్పుడు ఆమె అభిమానులకు షాకిస్తుంది.

కావ్య మారన్ కు యూత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కూతురే కావ్య మారన్. ఆమె రూ.33. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఒక్కతే వారసురాలు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమలో ఉందనే టాక్ వినిపిస్తుంది. అతడు మరెవరో కాదు.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. నివేదికల ప్రకారం అనిరుధ్, కావ్య ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ రూమర్స్ పై అనిరుధ్ పర్సనల్ టీం స్పందిస్తూ.. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. కావ్య, అనిరుధ్ ఇద్దరూ మంచి స్నేహితులు అని చెప్పుకొచ్చారు.

గతంలో అనిరుధ్ పేరు హీరోయిన్ కీర్తిసురేష్ తో వినిపించింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ టాక్ నడిచింది. కానీ ఇటీవలే కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు అనిరుధ్ పేరు సన్ రైజర్స్ టీం యజమాని కావ్య మారన్ తో వినిపిస్తుంది. అనిరుధ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..

3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు